ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
పుణ్యప్రదం... శబరిమలయాత్ర!
WD PhotoWD
భక్తులు ఇరుముడిలో తీసుకునివచ్చే పవిత్రమైన నేయిని అయ్యప్పస్వామి విగ్రహంపై పోసే విధానంలో ఓ సత్యం దాగి ఉంది. పరమాత్మతో జీవాత్మ కలిసిపోవటాన్ని ఇది సూచిస్తుంది.

అహం బ్రహ్మాస్మి అని సంస్కృతంలో చెప్పినట్లుగా ఈ దేవాలయం సందర్శన మీలోనూ దేవుడున్నాడన్న ముఖ్య సందేశాన్నిస్తుంది. అందువలనే ప్రతి భక్తుడు ఒకరికొకరు స్వామి అని పిలుచుకోవటానికి వెనుకగల అర్థమిదే. తత్వమాసి...అంటే నీవు సందేశం అయితే, ఆ సందేశాన్ని ఇచ్చేది భగవంతుడే. అద్వైతంలో చెప్పినట్లుగా ఈ విశ్వాంతరాళంలో నీవు ఒక భాగానివని అర్థం.

శబరిమలలో మకరజ్యోతి పూజ అత్యంత ప్రసిద్ధమైంది. ఈ పూజానంతరం పవిత్రమైన మకరజ్యోతి వెలుగు ఆకాశాన అన్నట్లు కొండల శిఖరాగ్రాన భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అపూర్వమైన ఘట్టంతో శబరిమల తీర్థయాత్ర ముగుస్తుంది.

శబరిమల పూజను ఆచరించే భక్తులు కొన్ని కఠిన నియమాలు పాటించాల్సి వుంటుంది. మండలపూజను ఆచరించే భక్తులు 41 రోజులపాటు నిష్ఠగా ఉండాలి.
WD PhotoWD
పూజాకాలంలో భక్తులు మాంసాహారం, ఇహపర సౌఖ్యాలకు దూరంగా ఉండాలి.

అయ్యప్ప స్వామి భక్తులు బృందాలుగా బయలుదేరతారు. ప్రతి సమూహానికి ఓ అధిపతి ఉంటాడు. ప్రతి భక్తుడు ఇరుముడి కట్టుగా పిలువబడే క్రొత్త దుస్తుల మూటను తెస్తాడు. కులం, మతం అంటూ కొన్ని హిందూ దేవాలయాలలో ప్రవేశానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నట్లుగా శబరిమల ఆలయంలో లేవు. 10 మరియు 50 ఏళ్ల పైబడిన మహిళలకు( రజస్వలకాని మరియు మెనోపాజ్‌లో ఉన్నవారు) తప్ప, మిగిలినవారికి ప్రధాన ఆలయంలోనికి ప్రవేశం లేదు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3  >> 
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
శ్రీకృష్ణ నామామృతాన్ని బోధించే ఇస్కాన్ దేవాలయం
నాగచంద్రేశ్వర ఆలయ దర్శనం.. సర్వ సర్ప దోష నివారణం
త్రయంబకేశ్వరుని దర్శించి.. తరించండి
నయనానందకరం ఓంకారేశ్వరుని ఉత్సవం
మంగళనాథుని దర్శనం.. దోష నివారణం
ఉజ్జయినిలోని 'మహాకాల్ ఆలయ' ప్రాశస్త్యం