ఆలయానికి సమీపంలో తూర్పువైపున సన్నిధానం అనే ప్రాంతం ఉంది. దీనిని వావర్‌కి అంకితం చేయబడింది. ముస్లిం అయినటువంటి, వావరునాధగా పిలిచే ఈయనను అయ్యప్ప స్వామికి సహచరుడుగా భావిస్తారు. ఈ దేవాలయాన్ని హిందువేతరులు సందర్శిస్తుంటారు.
ఎప్పుడు వెళ్లాలి శబరిమల యాత్ర ప్రధానంగా నవంబరు నుంచి జనవరి మాసం వరకూ జరుగుతుంది. 41 రోజుల వ్రతం చేసే అయ్యప్ప భక్తులు దీక్షాకాలంలో కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది. దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా మాంసాహారం, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండాలి.
నల్లటి చొక్కా, లుంగీ లేదా పంచెను ధరించాలి. కంఠ మాలను ధరించాలి. పరిశుభ్రానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. నేయితోనూ మరియు ఇతర పూజా సామగ్రితోనూ నిండిన ఇరుముడిన కలిగి ఉన్న భక్తులనే అయ్యప్ప స్వామి ఆలయంలోని 18 మెట్లను ఎక్కేందుకు అనుమతినిస్తారు.
శబరిమల యాత్ర సఫలం చేసుకునేందుకు ట్రావెన్‌కోర్ (టిడిబి) ఆమోదయోగ్యమైన ధరలకే అన్ని వసతి సౌకర్యాలను కల్పిస్తుంది. అయితే ప్రత్యేకించి దర్శనీయ కాలాలలో ఇక్కడ వసతి దొరకటం కష్టమే.
శబరిమలను చేరుకోవడమెలా... పంపా వరకూ వాహనాలు వెళతాయి. ఆ తర్వాత దాదాపు 4 కిలోమీటర్ల కాలిబాటన కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం ప్రస్తుతం అంతా సిమెంటుచేయబడింది. మార్గం ప్రక్కనే చిన్నచిన్న హోటళ్లు, తాత్కాలిక షాపులు, షిప్టు పద్దతిలో నిర్వహించే హోటళ్లు ఉన్నాయి. వీటితోపాటు వైద్య సహాయం కూడా అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేశారు. అయితే రోగులు శబరిమల యాత్రను చేయకూడదని తెలియజేయటమైంది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శబరిమలకు దగ్గరి రైలు స్టేషన్లు కొట్టాయం మరియు చెంగన్నుర్ (93 కి.మీ). అన్ని రైళ్లు త్రివేండ్రం వయా ఎర్నాకులం స్టేషన్లను తాకుతూ ఈ స్టేషన్లకు చేరతాయి.
ఇక తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 175 కిలోమీటర్ల దూరంలో శబరిమల ఉంది. అలాగే కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.
|