గణపతి స్తోత్రం ఓం గం గణపతయే నమో నమః సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బప్పా మోరియా...
సెప్టంబర్ 15వ తేదీ నుంచి మనం 'గణేషేత్సవాన్ని' జరుపుకుంటున్నాము... యావత్ భారతదేశం ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నది... విఘ్నేశ్వరుని జన్మదినాన్ని పురస్కరించుకుని 'ఖజరానా దేవాలయం' (ఇండోర్)ను మీకు పరిచయం చేసే దిశగా మీ ముందు ఉంచుతున్నాము. ఈ దేవాలయానికున్న పవిత్రత అత్యంత ప్రతిష్ఠను పొందినది. 1735 ఏ.డీ.లో ఈ దేవాలయం నిర్మితమైంది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మంగళ్ నాథ్ అనే పూజారి స్వప్నంలో కనపడిన గణనాథుడు తనను వెలుపలకు తీయవలసిందిగా కోరినట్లు చెప్పబడింది. తన స్వప్నాన్ని గురించి మంగళ్ నాధ్ రాణి అహిల్య సభకు విన్నవించుకున్నాడు. పూజారి స్వప్నాన్ని అనుసరించి పేర్కొన్న స్థలం (బావి) నుంచి వెలికితీయవలసిందిగా దేవీ అహిల్య ఆజ్ఞాపించారు. తవ్వకాలలో బయల్పడిన గణేషుని ప్రతిమ తదనంతరకాలంలో దేవాలయంలో ప్రతిష్ఠించబడింది.
|