దేవాలయం పూర్తి స్థాయిలో రూపొందే వరకు పూజారి మహేష్ భట్ వారసులు దేవాలయ నిర్వాహణ బాధ్యతలను చేపట్టేవారు... కానీ కొద్ది సంవత్సరాల క్రితం దేవాలయ నిర్వహణ జిల్లా పాలనాయంత్రాంగం చేతులలోకి వెళ్ళింది. ప్రస్తుతం జిల్లా మేజిస్ట్రేట్ రూపొందించిన కమిటీ దేవాలయ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నది. భట్ కుటుంబం సైతం దేవాలయ నిర్వహణలో పాలు పంచుకుంటున్నది. ప్రస్తుతం. దేవాలయాన్ని భాల్ చంద్ర భట్ నిర్వహిస్తున్నారు. దేవాలయ పునరుద్ధరణ కోసం ఆయన అనేక సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు. ప్రస్తుతం, ప్రత్యేక సందర్భాలలో ఆయన గణేశుని ప్రధాన ప్రార్ధన చేస్తున్నాడు.
ఏ సమయంలో అక్కడుకు వెళ్ళవచ్చు? భక్తుల కోసం దేవాలయ తలుపులు ఎల్లవేళలా తెరిచి ఉంటాయి. ప్రతి బుధవారం ఇక్కడ జరిగే సంతను మీరు చూడవచ్చు కానీ దేవాలయం యొక్క ప్రత్యేక ఉత్సవాలను మీరు చూడాలనుకున్నట్లయితే, గణేష్ చతుర్థి రోజు మీరు అక్కడకు తప్పనిసరిగా వెళ్ళాలి. ఆరోజు, ప్రత్యేక 'నైవేద్యం' గణేశునికి నివేదించబడుతుంది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చేరుకోవడమెలా? మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధానిగా ఇండోర్ ప్రస్తావించబడింది. మూడవ జాతీయ రహదారి అయిన ఆగ్రా-ముంబై రోఢ్డుకు ఇండోర్ కలుపబడి ఉంది. ఏదో విధమైన మార్గం ద్వారా మీరు ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు.
|