విఘ్నేశ్వరుడు, దేవతామూర్తులందరిలోనూ అత్యధిక సంఖ్యలో భక్తులచే ఇష్టదైవం... భక్తిప్రపత్తులతో పూజలందుకునే మహా శివుని కుమారుడు. కుడివైపున తొండము కలిగిన శ్రీ సిద్ధి వినాయకుని విగ్రహం 750 మి.మీ.ల ఎత్తు, 600 మి.మీల వెడల్పుతో ఏకశిల అయిన నల్ల రాతిపై చెక్కబడింది. ఇక్కడి గణేశుడు, సాధారణ గణేశుని విగ్రహాలకు భిన్నంగా కనిపిస్తాడు. పైన ఉన్న కుడి ఎడమ చేతులు కమలం మరియు గొడ్డలిని ధరించి ఉండగా దిగువన ఉన్న కుడి ఎడమ చేతులు జపమాల మరియు మోదకాలతో నిండిన పాత్రను చేబూని ఉంటాయి.
పవిత్రమైన జంధ్యాన్ని జ్ఞప్తికి తెస్తూ, ఎడమ భుజంపై నుంచి ఉదరానికి కుడి వైపు దాకా వ్యాపించి ఉన్న సర్పము కనిపిస్తుంది. విఘ్నాధిపతి ఫాలభాగంపై ప్రతిష్ఠితమైన నేత్రం, పరమశివుని త్రినేత్రాన్ని దాదాపుగా పోలి ఉన్నది. విఘ్నేశ్వరుని విగ్రహానికి ఇరువైపుల కొలువై ఉన్న సిద్ధి మరియు బుద్ధి దేవతా విగ్రహాలు, గణేశ విగ్రహం వెనుక నుంచి తొంగి చూస్తున్నట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇరువురు దేవతలతో గణపతి కొలువైన కారణంగా ఈ దేవాలయానికి సిద్ధివినాయక దేవాలయమనే పేరు సార్థకమయ్యింది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ దేవతలు పవిత్రత, విజయం, అభివృద్ధి మరియు ఐశ్వర్యానికి నిదర్శనంగా నిలుస్తారు. సిద్ధి మరియు బుద్ధి దేవతలు విజయం, సంపద మరియు అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తారు. కుడివైపునకు తిరిగిన తొండాన్ని కలిగి ఉన్న పవిత్రమైన శ్రీ సిద్ధివినాయకుని విగ్రహం ప్రత్యేకమైనది, అదెలాగంటే తొండం ఎడమవైపుకు తిరిగినట్లుగా ఉండే గణేశుని రూపం సర్వసాధారణమైనది కనుక. వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పదిహేను రోజుల పాటు సంప్రదాయబద్ధమైన పూజలు అందుకున్న అనంతరం అద్భుతమైన శ్రీ సిద్ధివినాయకుని విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించబడింది.
|