తన నివాసంలోని గోడకు వేలాడుతున్న లంబోదరుని చిత్రపటం స్ఫూర్తితో విగ్రహాన్ని రూపొందించవలసిందిగా ఆమె శిల్పులను ఆదేశించింది. అయితే శిల్పకారులకు స్ఫూర్తిగా నిలిచిన చిత్రం ముంబైలోని వాల్కేశ్వర్‌కు చెందిన బన్‌గంగాలోని 500 సంవత్సరాల నాటి విగ్రహానిది. స్వర్గీయ దేవూబాయ్‌కు పూజా సమయంలో ఉండగా దేవాలయాన్ని నిర్మించాలన్న ఆలోచన కలిగింది. ఆ సమయంలో ఆమె గణనాధుని ఈ విధంగా వేడుకుంది.
"నాకెలాగు సంతాన యోగం లేకుండా పోయింది, దేవాలయానికి వచ్చి నీకు ప్రార్థనలు జరిపే సంతానం లేని మహిళలకు దయచేసి సంతాన భాగ్యం ప్రసాదించు స్వామీ". దేవాలయ చరిత్రను పరిశీలించినట్లయితే, స్వర్గీయ దేవూబాయ్ ప్రార్థనకు, నిస్వార్థమైన ఆమె ఆకాంక్షకు ఏకదంతుడు అంగీకరించినట్లు తోస్తున్నది. అందుకేనేమో, అప్పటి నుంచి, సిద్ధివినాయకుడు "నవసచ గణపతి" లేదా మరాఠీలో "నవసాల పవనర గణపతి" (మనసావాచా కర్మణా ప్రార్థించే వారికి వరములిచ్చే గణపతి)గా భక్తులచే పిలువబడుతున్నాడు.
చేరుకునే మార్గం: దేశానికి వాణిజ్య రాజధానిగా భాసిల్లుతున్న ముంబై నగరానికి దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా విమానం, రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చును.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వసతి ఏర్పాట్లు: దేవాలయ నిర్వాహక కమిటీకి చెందిన ఎటువంటి ధర్మశాల లేదా వసతి గృహం లేకపోయినప్పటికీ అన్ని తరగతుల ప్రజల ఆర్థిక స్తోమతకు అనుగుణంగా లభించే హోటళ్ళు, ధర్మశాలలు మరియు లాడ్జీలకు ముంబైలో కొదవ లేదు.
|