ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
జైన శిల్పాకృతికి ప్రతీక శ్రీ మహావీర్‌ ఆలయం
WD PhotoWD
దేశంలో ఉన్న ప్రఖ్యాత జైన పుణ్యక్షేత్రాలలో రాజస్థాన్‌లోని శ్రీ మహావీర్‌జీ ఆలయం ఒకటి. 24వ జైన సాధువు మహావీరుని గౌరవార్థం తెల్లని పాలరాయితో గంభీర్ నదీ పరివాహక ప్రాంతంలో శ్రీ మహావీర్‌జీ ఆలయం నిర్మితమై ఉంది. దేవాలయ నిర్మాణానికి కారణమైన అద్భుతమైన దృష్టాంతం బహుళ ప్రాచుర్యం పొందింది. కొన్ని శతాబ్దాల కాలం ప్రతిరోజు ఉదయం ఇంటిని విడిచి మళ్ళీ సాయంత్రానికి గూటికి చేరుకునే ఆవు ఒకటి ఉండేది.

ఇందులో ఆశ్చర్యజనకమైంది ఏమీ లేకపోయినప్పటికీ, సాయంత్రం ఇంటికి చేరుకునే సమయానికి ఆవు పొదుగులు ఖాళీగా ఉండేవి. రహస్యం ఏమిటో
WD PhotoWD
తెలుసుకునేందుకు, ఆవును అనుసరించిన ఆవు యజమాని కుమారుడు ఆవు ఒక చోట ఆగి తనంతట తానే తన పొదుగును ఖాళీ చేసుకుంటున్న వైనాన్ని గుర్తించాడు. మర్మం ఏంటో తెలుసుకుందామన్న ఆసక్తితో అతడు ఆ ప్రాంతాన్ని తవ్వినంతనే మహావీరుని విగ్రహం బయటపడింది.


ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీడియోను వీక్షించండి
  1 | 2 | 3  >> 
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
ఇరువురు దేవతలతో కొలువైన సిద్ధివినాయకుడు
కోరిన కోర్కెలు తీర్చే ఖజరానా గణేషుడు
పుణ్యప్రదం... శబరిమలయాత్ర!
శ్రీకృష్ణ నామామృతాన్ని బోధించే ఇస్కాన్ దేవాలయం
నాగచంద్రేశ్వర ఆలయ దర్శనం.. సర్వ సర్ప దోష నివారణం
త్రయంబకేశ్వరుని దర్శించి.. తరించండి