తెల్లని పాలరాతి వేదికపై నిర్మితమైన మహావీర్‌జీ దేవాలయం పురాతనమైన మరియు ఆధునిక జైన శిల్పకళాకృతి మేలు కలయికగా నిలుస్తున్నది. పురాతనమైన జైనదేవాలయాలు అత్యధికంగా ఆభరణ శోభితమై, ఉన్నతస్థాయిలో మలచబడి ఉన్న నేపథ్యంలో, అందుకు భిన్నంగా నిర్మాణాకృతిలో మహావీర్‌జీ దేవాలయం సమకాలీకతను సంతరించుకున్నది. ఇతర జైన దేవాలయాల రీతిలో, ఈ దేవాలయం కూడా చిన్న దేవాలయాల సమూదాయంగా వెలుగొందుతున్నది.
ప్రధాన దేవాలయంలో కూర్చున్న భంగిమలోని జైన సాధువుల విగ్రహాలు, చక్కగా చెక్కబడిన స్థంభాల మధ్య కనిపిస్తాయి. అతిపెద్దదైన శాంతినాథ్ విగ్రహం, జైన మతస్థాపకులలో ఒకరు, 32 అడుగుల ఎత్తును కలిగి భక్తులపై కరుణాకటాక్షవీక్షణాలను ప్రసరింపచేస్తూ ఉంటుంది. విగ్రహానికి సమీపంలో బాల్కనీని కిరీటంలా ఆపాదించుకున్న ఎత్తైన కట్టడం కనిపిస్తుంది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
|