సూర్యుడు కనుమరుగైన సమయంలో ప్రకృతిలో చీకటి విస్తరించుకుంటున్న వేళ వేలకొలది దీపాలు వెలుగొందుతుండగా దేవాలయ ప్రాంగణం, అక్కడ దీపోత్సవం జరుగుతన్నదేమో అన్న భ్రాంతిని చూపరులకు కలిగిస్తుంది. ప్రత్యేక ఉత్సవాలు జరిగే మార్చి, ఏప్రిల్ మాసాలలో సందర్శకులు వాలయానికి విచ్చేసేందుకు అనువైన కాలం.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సందర్శించేందుకు సరియైన కాలం: శ్రీమహావీర స్వామి స్మృత్యర్థం చైత్ర శుక్ర ఏకాదశి నుంచి వైశాఖ కృష్ణ ద్వితీయ (మార్చి-ఏప్రిల్) మధ్య కాలంలో నిర్వహించబడే శ్రీమహావీర్‌జీ ఉత్సవం జరిగే సమయం సందర్శకులకు సర్వోత్తమమైన కాలం.
చేరుకునే దారి: రైలు మార్గం ద్వారా: న్యూఢిల్లీ-ముంబై బ్రాడ్ గేజ్ రైల్వే మార్గంపైన గల సవాయి మధోపూర్‌కు ఈ దిగంబర జైన పుణ్యక్షేత్రం 90 కి.మీ.ల దూరంలో ఉన్నది.
రోడ్డు మార్గం ద్వారా: మహావీర్‌జీ దేవాలయం, జైపూర్‌కు 176 కి.మీ.ల దూరంలో ఉన్నది.
విమాన మార్గం ద్వారా: 176 కి.మీ.ల దూరంలో జైపూర్ విమానాశ్రయం ఉన్నది.
|