ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
భక్తుల నీరాజనాలు అందుకుంటున్న 'అంభా భవానీ'
WD PhotoWD
పాలన్‌పూర్‌కు 65 కి.మీ.ల దూరంలో, అలాగే మౌంట్ అబూకు 45 కి.మీ.ల దూరంలో గల గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దు సమీపంలో అంబాజీ ఆధ్యాత్మిక పట్టణం నెలవై ఉన్నది. ప్రతి సంవత్సరం గుజరాత్ మరియు పొరుగున ఉన్న రాజస్థాన్ నుంచి లక్షల సంఖ్యలో భక్తులను ఆకర్షించే గుజరాత్‌లోని పవిత్రమైన దేవాలయాలలో ఒకటైన అంబాజీ మాత దేవాలయానికి ఈ పట్టణం ప్రసిద్ధి చెందినది.

అంబాజీ మాత యొక్క నిజ పీఠం అంబాజీ పట్టణానికి మూడు కి.మీ.ల దూరంలో గల గబ్బర్ పర్వత శిఖరంపై ఉన్నది. గౌరీ మాత హృదయంగా చెప్పబడుతున్న అంబాజీ మాత దేవాలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా భక్తుల పూజలను అందుకుంటున్నది. గబ్బర్‌లోని అంబాజీ మాత దేవాలయం అత్యంత పురాతనమైనది. ఆర్యులు తమ దేవగణంలోని దేవతగా ఆరాధించే అంబామాత తొట్టతొలి ఆర్య వంశం ఆరాధించే దేవతలలో ఒక దేవతగా పూజలందుకున్నది.

గబ్బర్ పర్వతంపై అమ్మవారి పాదముద్రలు ముద్రితమై ఉంటాయి. ముద్రితమైన అమ్మవారి రథం కూడా ఇక్కడ కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు తన తలనీలాలను సమర్పించుకునే ఉత్సవం ఇక్కడ జరగిందని భక్తుల విశ్వాసం. ఆరావళి పర్వత సానువుల్లోని అరసూర్ పర్వతంపైన కొలువైన అంబాజీ దేవాలయంలో ఎటువంటి
WD PhotoWD
దేవతా మూర్తి విగ్రహం కనిపించదు.

సముచిత స్థానంలో ప్రతిష్ఠించబడిన ఒక స్వర్ణయంత్రం మాత్రం ఈ దేవాలయంలో కనిపిస్తుంది. యంత్రంపై 51 శ్లోకాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే పూర్ణిమ నాడు జరిగే ఉత్సవాల్లో పాలుపంచుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని చేరుకుంటారు. వేల సంవత్సరాలుగా అంబాజీ మాత తన భక్తుల కోరికలను తీరుస్తున్నది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3  >> 
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
సర్వమత ప్రజల భక్తి విశ్వాసాల ప్రతీక ఆజ్మీర్ దర్గా
శివుని పంచభూత క్షేత్రాల్లో ఒకటి... శ్రీ అరుణాచలేశ్వర ఆలయం
జైన శిల్పాకృతికి ప్రతీక శ్రీ మహావీర్‌ ఆలయం
ఇరువురు దేవతలతో కొలువైన సిద్ధివినాయకుడు
కోరిన కోర్కెలు తీర్చే ఖజరానా గణేషుడు
పుణ్యప్రదం... శబరిమలయాత్ర!