ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
సంగీత చక్రవర్తి- బట్టుక్ భైరవ్
WD PhotoWD
రామ్ మోహన్ మరియు కృష్ణ మోహన్‌లు కూడా వారితో జత కడతారు. ఈ ప్రాంతం కథక్ నృత్యకారులకు అత్యంత పవిత్రమైనదిగా గుర్తించబడింది. అందుకు నిదర్శనంగా లక్నో ఘరానాకు చెందిన నృత్యకారులు ఇక్కడ గజ్జె కడతారు.

సూరదాస్ కీర్తనలకు శంభూ మహారాజ్ ప్రదర్శించిన నృత్య వైభవానికి మేము అచ్చెరవొందాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉస్తాద్ తమ విద్యార్థుల కాళ్ళకు గజ్జె కట్టారు. అనంతరం విద్యార్థులు ఆరంగేట్రం చేసారు. ఇక్కడ దమయంతి దేవిని కొలుస్తారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన నృత్యోత్సవం జరిగింది. 1974 సంవత్సరం నుంచి కనుమరుగైపోయిన గజ్జె కట్టే సంప్రదాయాన్ని పునరుజ్జీవంపచేస్తూ లచ్చు మహారాజ్ శిష్యురాలైన కుమ్‌కుమ్ ఆదర్ష్ తన శిష్యులకు గజ్జె కట్టారు. నగర మేయర్ డా. దినేష్ శర్మ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రస్తుతం కల్కా-బిన్‌డాదిన్ ద్యోధి నృత్య శిక్షణా సంస్థ అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నది. ప్రభుత్వ సహకారంతో ఈ దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు గురు బిర్జూ మహరాజ్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కె.ఎల్.సైగల్, సితార దేవి తదితర సంగీత ప్రముఖులు ఈ దేవాలయంలో ప్రదర్శనలు ఇవ్వడాన్ని
WD PhotoWD
తాను కనులారా వీక్షించినట్లు స్థానికులైన కల్నల్ విష్ణు రామ్ శ్రీవాస్తవ తెలిపారు.


భైరవ దేవాలయం నిర్వాహకులైన శ్యామ్ కిషోర్ కూడా భైరవ దేవుని సంగీతానికి భగవంతునిగా విశ్వసిస్తున్నారు. ప్రతి రోజు బట్టుక్ దేవునికి మద్యాన్ని నైవేద్యంగా కిషోర్ సమర్పిస్తున్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో దిగ్గజాలైన కిషన్ మహారాజ్, బిస్మిల్లా ఖాన్, హరిప్రసాద్ చౌరాసియా, బఫటి మహరాజ్ తదితరులు భైరవ దేవుని దర్శించుకుని, పూజలు చేసిన వారిలో ఉన్నారు.

రచన... అరవింద్ శుక్లా
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3   
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
సర్వశక్తి స్వరూపిణి కొల్లూర్ మూకాంబికాదేవి  
జై కనకదుర్గ.. జై జై కనకదుర్గ  
భక్తుల నీరాజనాలు అందుకుంటున్న 'అంభా భవానీ'  
సర్వమత ప్రజల భక్తి విశ్వాసాల ప్రతీక ఆజ్మీర్ దర్గా  
శివుని పంచభూత క్షేత్రాల్లో ఒకటి... శ్రీ అరుణాచలేశ్వర ఆలయం
జైన శిల్పాకృతికి ప్రతీక శ్రీ మహావీర్‌ ఆలయం