ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
శ్రీ హర్‌మందిర్ సాహిబ్, స్వర్ణదేవాలయం
Golden Temple
WD
శ్రీ హర్‌మందిర్ సాహిబ్, శ్రీ దర్బార్ సాహిబ్ లేదా స్వర్ణదేవాలయం (దేవాలయ సౌందర్యం మరియు బంగారు పూతను దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల భాషలో మాట్లాడే ప్రజలు పిలుచుకునే పేరు)గా పిలవబడే ఈ దేవాలయం, దేవాలయపు దేవుడు హరి (దైవం) పేరిట నామకరణం గావించబడింది. ప్రపంచంలోని సిక్కులందరూ, ప్రతి రోజూ శ్రీ అమృత్‌సర్‌ను సందర్శించి శ్రీ హర్‌మందిర్ సాహిబ్‌కు పూజలు చేయాలని మనసావాచాకర్మణా ఆకాంక్షిస్తుంటారు.

ఫోటోగ్యాలెరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిక్కులు ప్రార్ధనలు జరిపేందుకు అవసరమైన ఒక కేంద్రాన్ని నెలకొల్పాలనే తలంపు ఐదవ సిక్కు గురువైన గురు అర్జున్ సాహిబ్ మనోఫలకంలో మెదిలింది. తలచిందే తడువుగా స్వంతంగా శ్రీ హర్‌మందిర్ సాహిబ్ దేవాలయ నిర్మాణ ప్రణాళికను, భవన ఆకృతిని ఆయన స్వంతంగా రూపొందించారు. ప్రారంభంలోనే పవిత్ర సరోవరాన్ని (అమృత్‌సర్ లేదా అమృత్‌సర్ అనగా అమృత కొలను) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మూడవ సిక్కు గురువు అమర్‌దాస్ సాహిబ్ తిరస్కరించారు.
Praying
WD


కానీ బాబా బుద్ధజీ పర్యవేక్షణలో గురు రామదాస్ సాహిబ్ సమ్మతితో పవిత్ర సరోవరం రూపుదిద్దుకుంది. చెల్లింపుల ద్వారా స్థానిక గ్రామాల భూస్వాముల నుంచి సేకరించిన విరాళాలతో తొట్టతొలి గురు సాహిబ్‌లు, ప్రార్ధన కేంద్రానికి అవసరమైన భూమిని సముపార్జించారు. పట్టణ రూపకల్పనకు సైతం ప్రణాళిక రూపొందిచబడింది. తదనుగుణంగా, క్రీ.శ 1570 సంవత్సరంలో అమృతసరోవరం మరియు పట్టణ నిర్మాణ కార్యక్రమం ఏకకాలంలో ప్రారంభమయ్యింది. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పనులు క్రీ.శ 1577నాటికి పూర్తయ్యాయి.
వీడియోను వీక్షించండి
  1 | 2 | 3  >> 
చిత్రమాల
హర్మిందర్ సాహెబ్ స్వర్ణ దేవాలయం ఫోటోగ్యాలెరీ
మరిన్ని
లక్నోలో హనుమంతునికి ప్రదర్శనశాల  
సంగీత చక్రవర్తి- బట్టుక్ భైరవ్  
సర్వశక్తి స్వరూపిణి కొల్లూర్ మూకాంబికాదేవి  
జై కనకదుర్గ.. జై జై కనకదుర్గ  
భక్తుల నీరాజనాలు అందుకుంటున్న 'అంభా భవానీ'  
సర్వమత ప్రజల భక్తి విశ్వాసాల ప్రతీక ఆజ్మీర్ దర్గా