ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
శ్రీ హర్‌మందిర్ సాహిబ్, స్వర్ణదేవాలయం
Golden temple
WD
ముస్లీం సాధువు హజ్రత్ మియా మిర్‌జీ చే 1588 సంవత్సరం డిసెంబర్ మాసంలో గురు అర్జున్ సాహిబ్ కట్టడానికి శంకుస్థాపనను చేయించారు. గురు అర్జున్ సాహిబ్ స్వీయ పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరిగాయి. ఆయనకు సహాయకులుగా ప్రముఖులైన సిక్కులు బాబా బుద్ధజీ, భాయ్ గురుదాస్‌జీ, భాయ్ సాహ్లోజీ మరియు అనేక సిక్కు భక్తులు వ్యవహరించారు.

ఫోటోగ్యాలెరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

సాధారణంగా హిందూ దేవాలయ వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మాణాలు నేల మట్టానికి అధిక ఎత్తులో నిర్మించబడతాయి. అందుకు విరుద్ధంగా గురు అర్జున్ సాహిబ్ ఈ నిర్మాణాన్ని తక్కువ ఎత్తులో నిర్మించారు. అలాగే హిందు దేవాలయాల ప్రవేశానికి, వెలుపలకు రావడానికి ఒకే ద్వారం ఉంటుంది. కానీ గురు సాహిబ్ ఈ కట్టడానికి నాలుగు వైపులా ద్వారాలను నిర్మించారు. తదనుగుణంగా గురు సాహిబ్ కొత్తగా సిక్కు మత సృష్టికి నాంది పలికారు. అంతేకాక జాతి, మత, లింగ వివక్ష లేకుండా అందరూ దేవాలయ ప్రవేశానికి అర్హత పొందే అవకాశాన్ని గురు సాహిబ్ కల్పించారు.

కట్టడ నిర్మాణం క్రీ.శ 1601 ఏడాది పూర్తయింది. కొత్తగా సృష్టించబడిన ఆది గ్రంథ్ సాహిబ్ (అనంతర కాలంలో గురుగ్రంథ సాహిబ్)ను శ్రీ హర్‌మందిర్ సాహిబ్‌లో గురు అర్జున్ సాహిబ్ వ్యవస్థీకరించారు. అంతేకాక ఆది గ్రంథ్ సాహిబ్‌ను తొలిసారిగా పారాయణం చేసే గ్రంథీగా బాబా బుద్థజీని నియమించారు. ఈ సంఘటన అనంతరం 'అఠ్ సఠ్ తీర్థ్' స్థాయిని అది పొందింది. సిక్కులకు తమ కోసం ప్రత్యేకించిన స్వంత పుణ్యక్షేత్రం లభించింది.
Gurugranth Saahib
WD


సరోవరానికి మధ్య భాగంలో గల 67 చ.అడుగుల వేదికపై శ్రీ హర్‌మంది సాహిబ్ నిర్మితమైంది. వేదికపై 40.5 చ.అడుగుల విస్తీర్ణంలో దేవాలయం కొలువై ఉంది. దేవాలయానికి నాలుగు దిక్కులా ద్వారాలు ఉన్నాయి. ద్వారాలపై భాగాన్ని అద్భుతమైన కళాదృష్టితో అలంకరించారు. ప్రధాన భవనమైన శ్రీ హర్‌మందిర్ సాహిబ్‌కు దారి తీసే వంతెనకు వెళ్ళే విధంగా అది నిర్మితమైంది. అది 202 అడుగుల పొడవును 21 అడుగుల వెడల్పును కలిగి ఉంది.
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3  >> 
చిత్రమాల
హర్మిందర్ సాహెబ్ స్వర్ణ దేవాలయం ఫోటోగ్యాలెరీ
మరిన్ని
లక్నోలో హనుమంతునికి ప్రదర్శనశాల  
సంగీత చక్రవర్తి- బట్టుక్ భైరవ్  
సర్వశక్తి స్వరూపిణి కొల్లూర్ మూకాంబికాదేవి  
జై కనకదుర్గ.. జై జై కనకదుర్గ  
భక్తుల నీరాజనాలు అందుకుంటున్న 'అంభా భవానీ'  
సర్వమత ప్రజల భక్తి విశ్వాసాల ప్రతీక ఆజ్మీర్ దర్గా