వంతెన 13 అడుగుల వెడల్పు కలిగిన 'ప్రదక్షిణ' (వృత్తాకారపు మార్గం)తో కలుపబడి ఉంది. ప్రధాన దైవ మందిరానికి ఆవృతంగా సాగుతూ అది 'హరి కీ పౌడీ' (దేవుని యొక్క మెట్లు)కి దారి తీస్తుంది. 'హరి కీ పౌడీ' మొదటి అంతస్తులో గురు గ్రంథ్ సాహిబ్ నిత్య పారాయణం జరుగుతుంటుంది. శ్రీ హర్‌మందిర్ సాహిబ్ ప్రధాన కట్టడం నిర్వాహణపరంగానే కాక సాంకేతికంగా మూడంతస్తుల నిర్మాణం. వంతెనకు అభిముఖంగా గల నిర్మాణంలో పునరావృతమైన దంతాగ్ర ఆర్చిలు మరియు మొదటి అంతస్తు యొక్క పై కప్పు 26 అడుగుల 9 అంగుళాల ఎత్తున నిర్మితమైంది.
ఫోటోగ్యాలెరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
మొదటి అంతస్తు పై భాగంలో నాలుగు అడుగుల ఎత్తు గల పిట్టగోడ అన్ని వైపులా నిర్మించబడనదై నాలుగు మూలల యందు నాలుగు 'మమ్టీల'తో ప్రధాన మందిరం యొక్క కేంద్రీయ హాలుపై భాగంలో మూడవ అంతస్తుకు ఆసరా ఇస్తున్నది. అది మూడు ద్వారాలను కలిగిన చిన్న చతురుస్రపు గది. గురు గ్రంథ్ సాహిబ్ నిత్య పారాయణం ఇక్కడే జరుగుతుంటుంది.
ప్రపంచంలోనే అద్భుతమైన భవన నిర్మాణ శైలికి నమునాగా పేరొందినదై తన యొక్క నిర్మాణ పనులలో హిందూ ముస్లీంల సమైక్యతకు అద్దం పడుతున్నది. భారతీయ కళా చరిత్రలో తనదైన స్వయంప్రతిపత్తి కలిగిన సిక్కు భవన నిర్మాణ శాస్త్ర పాఠశాల సృష్టికి ఈ భవన నిర్మాణం దోహదం చేసిందని ప్రస్తావించబడింది.
చేరుకునే మార్గం: రైలు, రోడ్డు మరియు విమాన మార్గాల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు అమృత్‌సర్ అనుసంధానించబడింది.
|