ప్రతి సంవత్సరం 35 దేవాలయ ఉత్సవాలు నిర్వహించబడతాయి. డాకోర్‌లో కార్తీక, ఫాల్గుణ, చైత్ర మరియు అశ్విని పౌర్ణమి రోజుల్లో జరిగే ప్రధాన ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. నూతన సంవత్సర దినం నాడు అనగా కార్తీక మాసం మొదటిరోజున అన్నకూట్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో శ్రీ రంఛోడ్‌జీకి భారీ ఎత్తున మిఠాయిలు మరియు ఆహార పదార్దాలను నైవేద్యంగా సమర్పించుకుంటారు.
ఇతర వైష్ణవ ఉత్సవాలైన హోలీ, అమలక ఏకాదశి, జన్మాష్టమి, నంద్ మహోత్సవం, రథయాత్ర మరియు దసరా పండుగలను ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని ఏనుగుపై ఉంచి ఊరేగిస్తారు. ఆ సమయంలో భక్తులు పాటలతో, భజనలతో భక్తిసంద్రంలో ఓలలాడుతుంటారు. డాకోర్‌లోని రంఛోడ్‌జీ దేవాలయ సందర్శించి చేసుకునే గోపాలుని దర్శనం హిందువులు ప్రధానంగా భావించే నాలుగు పుణ్యక్షేత్రాల సందర్శనతో వచ్చే పుణ్యంతో సమానమని చెప్పబడింది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డాకోర్ చేరుకోవడమెలా : విమాన మార్గం : సమీపంలో గల అహ్మదాబాద్‌లో విమానాశ్రయం కలదు (95 కి.మీ).
రైలు మార్గం : డాకోర్ ఆనంద్ గోద్రా బ్రాడ్‌గేజ్ రైలు మార్గంలో ఉన్నది.
రోడ్డు మార్గం : అహ్మదాబాద్ మరియు వడోదరా నుంచి రాష్ట్రరోడ్డురవాణా సంస్థ బస్సులు మరియు ప్రైవేట్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉంటాయి.
|