కుతుబ్‌ఖానా గ్రంథాలయం - మసీదులో ఒక గ్రంథాలయం కూడా ఉంది. ఉర్దూ సాహిత్యానికి సంబంధించిన అరుదైన రచనలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. అంతేకాక ఇస్లాం మత పవిత్ర గ్రంథమైన ఖురాన్ బంగారు సిరాతో లిఖితమై కనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని అలంగీర్ ఔరంగజేబ్ సంకలనం చేశారని చెప్పబడింది. ఉర్దూ భాషలోని సాహితీ వ్యాసాలు, పత్రికలు ఈ గ్రంథాలయంలో చోటు చేసుకున్నాయి.
ఇజ్‌తిమా - గత 60 సంవత్సరాలుగా ప్రతి ఏటా మూడు రోజుల పాటు జరుగుతూ వస్తున్న ఇజ్‌తిమా సమ్మేళనంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు విచ్చేస్తుంటారు.
చేరుకునే మార్గం- మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నగరమైన భోపాల్‌కు ప్రతి ఒక్కరు సులభంగా చేరుకోవచ్చును.
విమాన మార్గం- న్యూఢిల్లీ, గ్వాలియర్, ఇండోర్ మరియు ముంబై నగరాల నుంచి ఇక్కడకు విమాన సర్వీసులు ఉన్నాయి.
రైలు మార్గం- భారతదేశంలోని ప్రధాన నగరాలకు భోపాల్ నగరం కలుపబడింది.
రోడ్డు మార్గం- ఇండోర్, మాండు, ఖజరహో, పంఛ్‌మడి, గ్వాలియర్, సాంఛీ, జబల్‌పూర్ మరియు శివ్‌పురి నగరాల నుంచి ఇక్కడకు బస్ సదుపాయం కలదు.
|