ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఏసుక్రీస్తును, మరియమాతను తమ ఇష్టదైవాలుగా భావించి కొలుస్తున్నారు. అయితే.. క్రిస్తు పుట్టిన రోజైన క్రిస్మస్‌ను పురస్కరించుకుని కేరళ రాష్ట్రంలోని చారిత్రాత్మక అమల ఉద్భవ మాత (తల్లి కన్నెమేరి) చర్చి ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం ఈ వారం తీర్థయాత్రలో. క్రిస్మస్ పండుగ సందర్భంగా.. ఏసుక్రీస్తును, ఆయన తల్లి మరియమ్మను అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. పరిశుద్ధ దేవతామాతగా, ఏసుతల్లిగా మరియమ్మను.. వారిని ప్రార్థించే మిలియన్ల క్రైస్తవ సోదరులకు తల్లిగా ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దేవుని కృపను పొందేందుకు మరియమ్మను ప్రార్థిస్తుంటారు. కన్యమేరి దేవునిబిడ్డ ఏసుక్రీస్తు తల్లి అనే విషయం ప్రతిఒక్కరికి తెలిసిన విషయం తెల్సిందే. గత 1854 సంవత్సరంలో తొమ్మిదో పోప్ పైస్ IX.... మేరిమాత జన్మపాపం లేకుండా గర్భందాల్చిందని, ఈ నిజాన్ని క్రైస్తవులు సంపూర్ణ మనస్సుతో అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. కన్యమేరి పరిశుద్ధురాలనే విషయం నాలుగో శతాబ్దికి చెందిన సెయింట్ అప్రామ్ రాసిన 'నిషిబియన్' అనే కవితా సంపుటిలో పేర్కొన్నారు.
కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళ జిల్లా సెయింట్ మేరీస్ ఫొరెన్నా చర్చి వెలసివుంది. ఈ ప్రాంతానికి కేరళ రాష్ట్ర ప్రజలతో పాటు.. దేశం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని వెళుతుంటారు. ఇక్కడకు కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే కాకుండా.. అన్ని మతాల వారు వచ్చి మాతను ప్రార్థిస్తుంటారు. అయితే.. ఇక్కడ ప్రార్ధనలు చేసే భక్తులు సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థనలు చేస్తే.. తమ కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం ఉంది. తమ వ్యాపారాలు, నూతన గృహప్రవేశాలు, కొత్త కోర్సులు, ఇలా.. ఏదైనా కావచ్చు వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని వారి విశ్వాసం.
|