ముట్టంలో ఉన్న ఈ పవిత్ర చర్చిలో ఏడాదికి రెండు సార్లు ప్రత్యేక ఉత్సవాలు జరుపుతుంటారు. కన్నెమాత ఉత్సవాలు డిసెంబరు ఎనిమిదో తేదీ తర్వాత వచ్చే తొలి ఆదివారం, ఆతర్వాత జనవరి నెల 21వ తేదీన నిర్వహిస్తారు. ఈ రెండు ఉత్సవాల్లో కన్నెమాత, జీసస్ క్రిస్ట్ విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ చర్చిలో ఉన్న గుమ్మటాన్ని ఆధునకకీకరించి, గత 16వ శతాబ్ధిలో పుణ్యస్థలంగా నిర్మించారు. ముఖ్యంగా.. ఈ చర్చి ఆకారం, నిర్మాణం పోర్చుగీసు భవన నిర్మాణ కళను పోలివుంటుందని, సెయింట్ జేవియర్ ఫ్రాన్సిస్ గోవా నుంచి కేరళకు వచ్చినపుడు ఈ పుణ్యస్థలంలో బసచేసినట్టు చెపుతున్నారు.
ఆ సమయంలే జేవియర్ అనారోగ్యంపాలైన ఒక చిన్నారికి ప్రాణం పోసినట్టు భక్తుల విశ్వాసం. ఈ చర్చి దక్షిణ భాగంలో ఆ శిలువను ఏర్పాటు చేశారు. సెయింట్ మేరిస్ అంటే.. పుణ్యలోకానికి రక్షకురాలు అని నానుడి ఉంది. సెయింట్ మేరిస్.. ఇక్కడకు వచ్చే పిల్లలు, పెద్దలు సుఖసంతోషాలతో అనందమయంగా జీవనం గడిపేలా దీవెనలు/ఆశీర్వాదాలు ఇస్తుందని పేర్కొంటారు. ఇలా..ముట్టంలోని సెయింట్ మేరిస్ చర్చి అందరి ప్రశంసలు అందుకోంటోంది.
|