|
|
|
అయ్యప్ప స్వామి కోయిక్కల్ దేవాలయం
|
|
|
|
|
ఆదివారం, 6 జనవరి 2008( 17:11 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | శబరిమలపై కొలువైన స్వామి అయ్యప్ప పండలమ్ రాజు పుత్రునిగా అవతరించినట్లు చెప్పబడింది. అచెన్‌కోవిల్ నది ఒడ్డున తన రాజప్రాసాదానికి అత్యంత సమీపంలో శబరిమల గిరిపై ప్రస్తుతం వలియ కోయిక్కల్ దేవాలయంగా పిలవబడుతున్న దేవాలయాన్ని పండలమ్ రాజు నిర్మించాడు.
స్వామి అయ్యప్ప యువకునిగా గడిపిన పండలమ్ ప్రాంతానికి శబరిమల ఉత్సవాల కాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. శబరిమలకు ప్రయాణించే భక్తులు ముందుగా ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
మకరజ్యోతి దినాన్ని పురస్కరించుకుని శబరిమలపైన కొలువైన స్వామి అయ్యప్ప విగ్రహానికి ప్రత్యేకంగా అలకరించే పవిత్రమైన ఆభరణాలను పండలమ్ రాజప్రాసాదంలో ఉంచుతారు. మకరజ్యోతి దినోత్సవానికి రెండు మాసాల ముందుగానే భక్తులు పూజించే నిమిత్తం పవిత్రమైన ఆభరణాలతో కూడిన పెట్టెలను తెరిచి ఉంచుతారు.
స్వామి అయ్యప్ప విగ్రహానికి అలంకరించేందుకు ఉద్దేశించిన పవిత్రమైన ఆభరణాలను మకర జ్యోతి దినోత్సవానికి మూడు రోజుల ముందు పండలమ్ నుంచి శబరిమలకు ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ ఊరేగింపుకు రక్షణ కల్పిస్తున్నట్లుగా గగన తలంలో ఒక డేగ ప్రత్యేక్షమై శబరిమల వరకు సాగే ఊరేగింపును అనుసరిస్తుంది. డేగ రాకను భగవంతుని లీలగా భక్తులు భావిస్తుంటారు.
| | వ్యవహరిస్తారు. పండలమ్ కోయిక్కల్ శాస్థ దేవాలయం నుంచి జనవరి 12 మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమయ్యే "తిరువాభరణం" (పవిత్రమైన ఆభరణాలు) ఊరేగింపుకు రాజ కుటుంబ రక్షకునిగా తిరువథిరనల్ రాఘవవర్మ రాజా వ్యవహరిస్తారు.
స్థల పురాణం స్వామి అయ్యప్ప వృత్తాంతానికి సంబంధించి వేర్వేరు ఇతివృత్తాలు ప్రచారంలో ఉన్నాయి. పండలమ్ రాజకుమారునిగా స్వామి అయ్యప్ప అవతరించిన వృత్తాంతం అత్యంత ప్రజాదరణ పొందినదై సర్వత్రా ఆమోదించబడింది. వృత్తాంతాన్ని అనుసరించి పండలమ్ రాజ్యాన్ని రాజా రాజశేఖర పరిపాలిస్తున్న కాలంలో, వేటకై బయలుదేరిన రాజుకు పంపా నది తీరాన ఒక శిశువు రోదిస్తున్న ధ్వని వినపడింది.
|
|
|
|
|