ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అయ్యప్ప స్వామి కోయిక్కల్ దేవాలయం
WD PhotoWD
మణికంఠునిలోని దైవత్వాన్ని వారు కనుగొన్నారు. రాజ్యసంక్షేమం కోసం తమ పాపవిమోచనార్థం తమతో పాటుగా ఉండవలసిందిగా వారందరూ మణికంఠుని వేడుకున్నారు. అయినప్పటికీ, రాజప్రాసాదాన్ని విడిచి వెళ్ళాలని మణికంఠుడు నిర్ణయించుకున్నాడు.

సంతోషం, దుఃఖం, భయం, ఆశ్చర్యం మరియు భక్తితో కలిగిన భావోద్వేగాల మధ్య తనను తాను సమర్పించుకున్నవాడై నిలుచుండిపోయిన రాజు, మణికంఠుని కరుణా కటాక్ష వీక్షణాలకై ప్రార్థించడం మొదలుపెట్టాడు. మణికంఠునిలో దైవికశక్తులను గుర్తించక తన కుమారునిగా భావించి పెంచినందుకు మన్నించవలిసిందిగా పదేపదే అభ్యర్థించసాగాడు.

రాజు ప్రార్ధనలకు సంతసించిన మణికంఠుడు, రాజుకు మోక్ష సిద్ధి మార్గాన్ని చూపుతాడు. అంతేకాక పవిత్రమైన పంపానదికి ఉత్తరాన శబరమల గిరిపై దేవాలయాన్ని నిర్మించి, అందులో తన విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు రాజుకు ఆనతిని ఒసంగుతాడు. అదేసమయంలో శబరిమల పుణ్యక్షేత్రం ప్రాశస్త్యాన్ని వివరించిన అయ్యప్ప, 'వ్రతం' యొక్క ప్రాధాన్యతను, తన 'దర్శనం' ద్వారా భక్తుల పొందే పుణ్యఫలాన్ని సమగ్రంగా వెల్లడిస్తాడు.

తన భక్తుల పూజలను రాజు కూడ అందుకుంటాడని ప్రకటించిన అయ్యప్ప, రాజుతో సహా అక్కడ ఉన్న అందరినీ ఆశీర్వదించి అంతర్థానమైపోయాడు. అనంతరం శబరిమలపై దేవాలయాన్ని నిర్మించిన రాజు, దేవాలయాన్ని అయ్యప్పకు అంకితమిచ్చాడు
WD PhotoWD
శబరిమలకు ఊరేగింపుగా చేరుకున్న పవిత్రమైన స్వర్ణాభరణాలతో స్వామి అయ్యప్ప విగ్రహాన్ని అలంకరిస్తారు. తదనుగుణంగా "తిరువభరణ ఘోష యాత్ర" అత్యంత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది.

చేరుకునే మార్గ
పండలమ్ పట్టణానికి ఒక కి.మీ దూరంలో గల మెయిన్ సెంట్రల్ రోడ్డుకు సమీపంలో వలియకోయిక్కల్ దేవాలయం కొలువై ఉంది. పండలమ్ బస్ స్టేషన్ అత్యంత సమీపమైంది. ఇక్కడకు 14 కి.మీ.ల దూరంలోని చెంగన్నూర్ రైల్వే స్టేషన్ సమీపమైంది. దాదాపు 100 కి.మీ.ల దూరంలో గల తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపమైంది.
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3   
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
దేవతలు కొలువుండే కైలాస పర్వతం  
ముట్టంలోని సెయింట్ మేరీస్ చర్చి  
మసీదులకే తలమానికం "తాజుల్ మసీదు"  
శక్తి పుణ్యక్షేత్రం...పావగఢ్ శక్తి పీఠం  
పద్దెనిమిది చేతుల "మహాలక్ష్మీ శ్రీ కాళీమాత"  
డాకోర్‌లోని రంఛోడ్‌రాయ్‌జీ దేవాలయం