|
ఆధ్యాత్మిక సుగంధాల మోహన్‌ఖేఢా తీర్థం
|
|
|
|
|
ఆదివారం, 13 జనవరి 2008( 17:50 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | పరమపవిత్రమైన మోహన్‌ఖేడా జైన తీర్ధం, ధార్‌కు 47 కి.మీ.ల దూరంలో ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారికి సమీపంలో కొలువై ఉంది. పూజ్య గురుదేవ్ శ్రీ రాజేంద్ర సురీశ్వర్‌జీ మహారాజ్ సాహెబ్ 1940 సంవత్సరంలో ఈ తీర్ధాన్ని నెలకొల్పారు. ఈ తీర్ధంలో పద్మాసన భంగిమలోని భగవాన్ ఆదీశ్వర్ 16 అడుగుల విగ్రహం ప్రతిష్టించబడింది. అలాగే శ్రీ రాజేంద్ర సురీశ్వర్‌జీ, శ్రీ యతీంద్ర సురీశ్వర్‌జీ మరియు శ్రీ విద్యాచంద్ర సురీశ్వర్‌జీ మహరాజ్ సాహెబ్‌లకు చెందిన సమాధి మందిరాలు నిర్మించబడినవి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు, చైత్ర, పుష్య మాసాల సప్తమి రోజుల్లో ఇక్కడ తిరునాళ్ళ జరుగుతుంది.
ఈ సంవత్సరం జనవరి 15వ తేదీన తిరునాళ్ళ నిర్వహించబడుతుంది. మాల్వా ప్రపంచంలో అవతరించిన పరమ పూజ్యులైన దాదా గురుదేవ్ ప్రభు శ్రీమద్ విజయ్ రాజేంద్ర సురీశ్వర్‌జీ తన బోధనలతో ఈ ప్రాంతానికి పవిత్రతను తీసుకువచ్చారు. 1940 సంవత్సరంలో రాజ్‌గఢ్‌కు పశ్చిమంగా శతృంజయ అవతారమైన రిషబ్‌దేవ్‌జీ జైన దేవాలయాన్ని ఆయన నెలకొల్పారు. రాజ్‌గఢ్‌కు సమీపంలో ఖేడా పేరు గల ప్రాంతం కలదు. బంజారా సంచార జాతి ప్రజలు ఇక్కడ నివసిస్తుండేవారు.
|