|
|
|
అందరివాడు... ఆపదమొక్కులవాడు... గోవిందుడు...
|
|
|
|
|
|
ఆదివారం, 27 జనవరి 2008( 15:26 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | లడ్డు ప్రసాదం: స్వామి వారి ప్రసాదమైన లడ్డుతో ఇంటికి చేరితేనే తమ తీర్థయాత్ర సంపూర్ణమైనట్లు భక్తులు భావిస్తుంటారు. స్వామివారికి వెళ్లే క్యూలలో భక్తులు పొందిన దర్శన స్థాయికి సంబంధించిన టిక్కెట్టుకు అనుగుణంగా లడ్డు టోకెన్లను కౌంటర్లలో వారు అందిస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని సర్వదర్శన భక్తులు, ప్రతి భక్తునికి ఒక లడ్డు టోకెన్‌ను రొక్కం పుచ్చుకుని అందిస్తారు. దర్శనానంతరం భక్తులు దేవాలయం వెలుపల ఏర్పాటు చేసిన కౌంటర్లలో టోకెన్లను సమర్పించి లడ్డూలను పొందవచ్చు. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, తెప్పోత్సవం, పవిత్రోత్సవాలకు భక్తుల లక్షల సంఖ్యలో విచ్చేస్తారు.
స్వామి సన్నిధిలో శుభకార్యాలు: స్వామి సన్నిధిలో శుభకార్యాలు జరుపుకోవాలనుకునే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. వివాహాలు, నామకరణం, ఉపనయనం తదితర శుభకార్యాలను సంఘానికి చెందిన పురోహితులు దక్షిణ, ఉత్తర భారత సాంప్రదాయాలను అనుసరించి నిర్వహిస్తుంటారు.
వసతి సౌకర్యాలు: భక్తుల సౌకర్యార్థం తితిదే పాలకమండలి ఉచిత వసతి గృహాలను నిర్మించింది.
చేరుకునే మార్గం: | |
విమానమార్గం : తిరుపతిలో గల చిన్నపాటి విమానాశ్రయానికి హైదరాబాద్ నుంచి మంగళవారం, శనివారాలలో విమాన సర్వీసులు కలవు. తిరుపతికి అతి సమీపంలో గల చెన్నై నగరం నుంచి ప్రతి రోజు రెండు విమాన సర్వీసులు కలవు. విమానశ్రయం నుంచి తిరుమలకు భక్తులను చేరవేసే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడుపుతోంది.
|
|
|
|
|