|
|
|
ప్రపంచ ప్రసిద్ధినొందిన బావన్‌గాజ జైన సిద్ధ క్షేత్రం
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| | మహామస్తకాభిషేకం : బావన్‌గాజా ఆదినాథ దేవుని మహామస్తకాభిషేకం 17 సంవత్సరాల అనంతరం జరుగుతోంది. జనవరి 20, 2008 న మొదలై ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు మహామస్తకాభిషేకం నిర్వహించబడుతోంది. ఆధ్యాత్మక శిఖరాలకు చేర్చే మహామస్తకాభిషేకాన్ని వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు బావన్‌గాజా చేరుకుంటారు. మహామస్తాకాభిషేకం జరుగుతున్న సమయంలో భక్తి పారవశ్యాల మధ్య భక్తులు ఆధ్యాత్మిక భావనలతో నిండిన గీతాలను పాడుకుంటూ నృత్యాలలో మునిగితేలుతారు. కొండలపైన పలు ప్రాంతాలలో కూర్చున్న గిరిజనులు దివ్యమైన అనుభూతులకు లోనవుతూ ఉత్సవాన్ని తిలకిస్తారు. ప్రకృతి సౌందర్యం : | | అందమైన పర్వతాలను నయనాందకరంగా ప్రదర్శిస్తుంది. ఇచ్చటి ప్రకృతి సౌందర్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం బావన్‌గాజాను ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా ఇటీవల ప్రకటించింది.
చేరుకునే మార్గం : ఇండోర్ (155 కి.మీ) మరియు ఖాండ్వా (180 కి.మీ.) నగరాల నుంచి బస్సు మరియు టాక్సీ ద్వారా బావన్‌గాజాకు చేరుకోవచ్చు. సమీప విమానశ్రయం : దేవీ అహల్యా విమానాశ్రయం, ఇండోర్ (155 కి.మీ.) సమీప రైల్వే స్టేషన్లు : ఇండోర్, ఖాండ్వా ఎక్కడ బస చేయాలి : లోయలో 50 గదులను కలిగిన ఆరు ధర్మశాలలు ఉన్నాయి. ఇక బావన్‌గాజాకు ఎనిమిది కి.మీ.ల దూరంలో గల బార్వానీలో వారి వారి ఆర్థిక స్థితిగతులకు తగిన రీతిలో అన్ని రకాల వసతి సౌకర్యాలు లభిస్తాయి.
|
|
|
|
|