మన దేశంలోని పుణ్యక్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలలోని సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి ఈ వారం తీర్థయాత్రలో దర్శిద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటదైన సోమేశ్వర లింగం మిక్కిలి ప్రఖ్యాతి చెందిన పురాతనమైన శైవ క్షేత్రం . పశ్చిమ భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం (సౌ రాష్ట్రం) లోని ప్రభాస పట్టణంలో నెలకొని ఉన్నది. స్కదపురాణం, శ్రీమద్భాగవత్, శివపురాణాలలోని ఆనవాళ్లు ఈ తీర్థయాత్రలో మనకు దర్శనమిస్తాయి. సరస్వతీ నదీ సాగర సంగమం చేసే ఈ పవిత్ర స్థలంలో సోమనాథుని దర్శనం ఎంతో పుణ్యప్రదమైనదిగా ఋగ్వేదంలో చెప్పబడింది.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథుని ఆలయంపై ఆరుసార్లు ముస్లిం దాడులు జరిగాయి. ఫలితంగా ఆ దేవాలయం భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపింపజేస్తుంది. దాడుల తర్వాత మహమేరు ప్రసాద్ పద్ధతిలో ఆలయాన్ని నిర్మించటం జరిగింది. భారతదేశ ఉక్కుమనిషి సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రస్తుత ఆలయానికి మార్గదర్శకులని చెప్పవచ్చు.
గర్భగుడి, సభామండపం, నృత్య మండపాలతో కూడుకుని ఉన్న ఈ ఆలయం శిఖరం ఎత్తు 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. శిఖరానికి అగ్రభాగాన విరాజిల్లే కలశం బరువు 10 టన్నులు. అంతేకాదు అడుగు వెడల్పుతో 27 అడుగుల ఎత్తులో ఆలయ ధ్వజస్తంభం గోచరిస్తుంది.
పురాణంలో... సోమనాథునికి మరో పేరు చంద్రుడు. సోముడు దక్షిణుని అల్లుడు. ఓ రోజున దక్షిణుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. దీన్ని అల్లుడైన సోమనాథుడు అమలు చేయకపోవడంతో మామ ఆగ్రహం చెంది, శపిస్తాడు. అప్పటి వరకు ప్రతి రాత్రి ప్రకాశవంతమైన కాంతిని (వెన్నెల) వెదజల్లిన చంద్రుడు.. ఆ రోజు నుంచి కొద్దికొద్దిగా మాయం కావడం ఆరంభమై.. ఒక రోజు పూర్తిగా కనిపించకుండా పోతాడు. దీంతో ముక్కోటి దేవతలు ఏకమై శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా దక్షిణుని వేడుకున్నారు.
|