ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భక్తుల కోర్కెలు తీర్చే.. పద్మావతి అమ్మవారు
WD PhotoWD
దేశంలోని పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న పవిత్ర స్థలం అలివేలు మంగాపురం. తిరుపతికి సమీపంలో వెలసివున్న చిన్న ప్రాంతానికి మరో పేరు తిరుచానూరు. ఇక్కడి ఆలయంలో అందమైన ప్రతిరూపంతో పద్మావతి అమ్మవారు కొలువై అశేష భక్తుల నుంచి నీరాజనాలు అందుకోంటోంది. ఏడు కొండల్లో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ముక్తి పొందాలనుకునే భక్తులు... తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకుండా వెనుదిరగ కూడదని పురాణాలు చెపుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. శ్రీ మలయప్ప స్వామిని దర్శించుకుంటే లభించే భక్తి, ముక్తిమార్గాలు శ్రీ పద్మావతి అమ్మవారిని కనులారా చూస్తేనే వస్తాయని ఇక్కడకు వచ్చే అశేష భక్తుల ప్రగాఢ విశ్వాసం.

చరిత్ర పురాణం...
తిరుచానూరులో శ్రీ వేంకటేశ్వరునికి ఒక చిన్న ఆలయం ఉండేది. ఈ ఆలయాన్ని అన్ని రకాల మతస్థులు వచ్చి దర్శించుకుని పూజలు చేసేవారు. ఆ దేవాలయం అతి చిన్నదిగా ఉండటం వల్ల అక్కడ అన్ని రకాల స్వామి పూజలు చేయడం వీలు పడలేదు. దీంతో ఆ ఆలయానికి కొద్ది దూరంలో మరో ఆలయాన్ని నిర్మించారు. అక్కడ అతి ముఖ్యమైన పూజలు మాత్రమే చేసే వారని చెపుతుంటారు. తర్వాత ఆలయానికి విశాలమైన స్థలం లేకపోవడంతో అందులోని విగ్రహాలను వేరే చోటికి
WD PhotoWD
తరలించారు. అలా ఈ ఆలయం కొంత మేరకు ప్రాముఖ్యతను కోల్పోయినట్టు స్థానికుల అభిప్రాయం.


అయితే.. 12వ శతాబ్దిలో ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చిన యాదవరాజు ఇక్కడ శ్రీకృష్ణ బలరామ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత అనగా.. రెండు శతాబ్దాల అనంతరం అంటే 16, 17వ శతాబ్దిలో సుందర వరదరాజ స్వామిని ఇక్కడ ప్రతిష్టించారు. ఆ సమయంలోనే పద్మావతి అమ్మవారికి వేరొక ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెపుతోంది. పురాణంలో పేర్కొన్నట్టుగా అలమేలు మంగాపురంలో ఉన్న ఆలయ ప్రాంగణంలోని కోనేరులోని తామర పువ్వు నుంచి పద్మావతి అమ్మవారు జన్మించినట్టు మరో ప్రచారం కూడా ఉంది.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
మరిన్ని
పురాతన శైవ క్షేత్రం.. సోమనాథ్ ఆలయం  
శని - షిన్‌గ్నాపూర్ శనీశ్వరాలయం  
సర్వపాపహరణం... కాశీ సందర్శనం  
మహిళల 'శబరిమల' ఆట్టుకల్ భగవతీ ఆలయం  
శక్తిదేవత తుల్జా భవానీ  
'భోజ్‌శాల'... సరస్వతీ మాత దేవాలయం