పురాణ గాధ... శివుని కుమారుడైన కార్తికేయన్.. దేవతా సైన్యానికి దళపతిగా ఆరు రోజుల పాటు నియమితులవుతాడు. ఆ సమయంలో రాక్షసుడైన తారకాసురుడు దేవతులను, భిక్షవులను చిత్ర హింసలకు గురి చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కార్తికేయన్ తారకాసురుడుని హతమార్చి దేవతలతో పాటు.. ఇతరులను రక్షిస్తాడు. అయితే.. ఈ తారకాసురుడు శివుని పరమ భక్తుడు. ఇది తెలుసుకున్న కార్తికేయన్ ఎంతో చింతిస్తాడు.
పాప విముక్తి కోసం విష్ణు దేవుని కార్తికేయన్ ప్రార్థిస్తాడు. అపుడు కార్తికేయన్‌కు విష్ణువు ఒక సలహా ఇస్తాడు. అదేమిటంటే.. తారకాసురుని హతమార్చిన ప్రాంతంలో మహాశివునికి ఒక ఆలయం నిర్మించాలని చెపుతాడు. అది కాలక్రమేణా స్తంభేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందినట్టు పురణాలు పేర్కొంటున్నాయి.
ఈ ఆలయంలో ప్రతినెలా అమవాస్య రోజున ప్రత్యేక పూజలు సాగుతుంటాయి. అలాగే శివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అమవాస్య తర్వాత 11వ రోజున భక్తులు ఒక సంపూర్ణ రాత్రి పూజలు చేస్తూ భక్తిలో లీనమవుతారు. దేశంలోని నలు దిక్కుల ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడకు వచ్చి, తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని ముక్తి పొందుతుంటారు. ముఖ్యంగా ప్రకృతే మహాశివునికి అభిషేకం చేసే అపురూప దృశ్యాన్ని తమ కనులారా వీక్షించి తరిస్తారు. ఈ ప్రాంతానికి దేశంలోని నలుదిక్కుల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
|