ప్రకృతి ఆరాధించే మా చంద్రికాదేవి ధామ్ దేశంలో ప్రసిద్ధి గాంచిన పుణ్య స్థలాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు సమీపంలో ఉన్న పక్షికా తలాబ్ (పక్షుల నివాస కేంద్రం)కు 11 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం వెలసివుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న వేప చెట్టు కింద వెయ్యి సంవత్సరాలకు చెందిన పురాతమైన దుర్గాదేవి విగ్రహం కొలువైవుంది.. మహీ సాగర్ సంగమ క్షేత్రానికి సమీపంలో ఈ ఆలయం వుంది.
18వ శతాబ్ది మధ్య కాలంలో ప్రతి పౌర్ణవి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు పురాణాలు చెపుతున్నాయి. ఆ పద్ధతి నేటికి ఆచరిస్తున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమ కోర్కెలు నెరవేరడం కోసం ఎరుపు రంగు వస్త్రాన్ని వేప చెట్టుకు కడుతారు. కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ ఆలయానికి వచ్చి ఎరుపురంగు వస్త్రాన్ని విప్పేస్తారు. అనంతరం తమ ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేసి, ప్రసాద నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ పిమ్మట ఆలయం అభివృద్ధి కోసం తమ కిష్టమైన పనులను చేస్తారు. ఈ ఆలయంలో కొబ్బరి కాయ కొట్టడంతో పాటు ఇతర పూజలను నిషేధించారు.
మా చంద్రికాదేవి ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరు సమానం. ఈ ఆలయ పరిపాలనా నిర్వహణను పూర్తిగా అఖిలేష్ సింగ్ అనే వ్యక్తి చూస్తుంటారు. మహీ సాగర్ సంగమానికి ఉన్న ప్రధాన పూజారుల్లో ఒకరు. ఇక్కడకు వచ్చే మధ్యతరగతి ప్రజలు భైరవుని దర్శించుకుంటారు. అన్ని మతాలు, కులాల వారిని ఒక చోటకు చేర్చే పవిత్ర పుణ్య స్థలంగా మా చంద్రికా దేవి ధామ్ పేరుగాంచింది.
స్కందపురాణంలో కనిపించే ఘటోత్కజుని కుమారుడు బార్బరిక్ ఇక్కడ పూజలు చేసినట్టు చరిత్ర చెపుతోంది. చంద్రికా దేవి ధామ్ ఆలయానికి ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో గోమతి నది ప్రవహిస్తోంది. అలాగే మహీ సాగర్ సంగమం ఈ ప్రాంతానికి తూర్పు ప్రాంతంలో వెలసివుంది. అయితే ఈ ప్రాంతానికి నీరు వల్ల ఎలాంటి ఉపద్రవం సంభవించింది లేదు. ముఖ్యంగా ఈ ప్రాంతం నేరుగా పాతాళగంగతో అనుసంధానమై ఉన్నట్టు ఇక్కడి భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఇక్కడకు వచ్చే భక్తులు బార్బరిక్‌ను కూడా పూజించి వెళుతుంటారు.
|