ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భక్తుల కోర్కెలు తీర్చే మా చంద్రికాదేవి ధామ్
WD PhotoWD
మహీ సాగర్ సంగమంలో భక్తులు స్నానమాచరించిన తర్వాతే చంద్రుని దర్శించుకుంటారు. ఇక్కడే తక్ష ప్రజాపతి శాప విముక్తుడైనట్టు భక్తుల విశ్వాసం. పురాణ కాలంలో లక్ష్మణ్ - ఊర్మిళకు జన్మించిన చంద్రకేతు అమవాస్య రోజున కారడవిలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో నవ దుర్గా మాతను ప్రార్థిస్తూ పూజలు చేయగా, మా చంద్రికా దేవి ప్రత్యక్షమై, చంద్రకేతు మనస్సులోని భయాన్ని పోగొట్టినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

మహాభారతంలో కూడా పాండవులు ద్రౌపదిని వెంటబెట్టుకుని వనవాసానికి వెళ్లినపుడు ఈ ప్రాంతానికి వచ్చినట్టు పురణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా ఈ ఆలయం వెనుక ఒక మూఢ నమ్మకం కూడా ప్రచారంలో ఉంది. యుధిష్టురుడు, హాన్స్‌రాజ్ అనే ఇద్దరు రాజుల మధ్య జరిగిన యుద్ధంలో హాన్స్‌రాజ్ కుమారుల్లో ఒకరైన సుంధన్వా మాత్రం ఈ పోరుకు దూరంగా ఉన్నారు.

ఆ యుద్ధ సమయంలో సుంధన్వా నవ దుర్గా పూజల్లో నిమగ్నమయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేని రాజు హాన్స్‌రాజ్ తన కుమారుడిని కాగే వేడి నూనెలో వేయాల్సిందిగా భటులను ఆదేశిస్తాడు. రాజు ఆదేశం మేరకు సేవకులు సుంధన్వాను కాగుతున్న నూనెలో వేస్తారు. అయితే మా చంద్రికా కృపా కటాక్షాలతో సుంధన్వా ప్రాణాలతో బయటపడతాడు.

ఈ సంఘటన తర్వాత ఈ ప్రాంతానికి సుంధన్వా కుండ్ అనే పేరు వచ్చింది. అలాగే.. యుధిష్టురుడు తన సేనలతో నివశించిన ప్రాంతానికి ప్రస్తుతం కటక వాసా అన
WD PhotoWD
పేరు వాడుకలో ఉంది. ఇలాంటి ప్రసిద్ధ పురాణ గాథలు కలిగిన ఈ ప్రాంతంలో హావన్ కుండ్, యాగశాల, చంద్రికా దేవి న్యాయస్థానం, బార్బిరిక్ ప్రవేశద్వారం, సుధన్వా కుండ్, బ్యాంక్ ఆఫ్ మహి సాగర్ సంగమాలు ఉన్నాయి.

హిందు మతానికి చెందిన ప్రముఖ రచయితల్లో ఒకరైన దివంగత అమ్రిల్లాల్ నగర్ రాసిన 'కర్వట్' అనే పుస్తకంలో ఈ పుణ్యస్థలం గురించి ప్రత్యేకంగా వివరించారు. ఇక్కడ నివశించే భక్తులు ఈ ప్రాంతాన్ని చారిత్రాత్మక ప్రదేశంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
వీడియోను వీక్షించండి
<< 1 | 2 
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం
భక్తుల కోర్కెలు తీర్చే బీజాసేన్ ఆలయం  
దేవాస్‌లో కొలువు తీరిన భవాని మాతలు  
మహదేవునికి సముద్రుని జలాభిషేకం  
భక్తుల కోర్కెలు తీర్చే.. పద్మావతి అమ్మవారు  
పురాతన శైవ క్షేత్రం.. సోమనాథ్ ఆలయం