|
|
|
శ్రీకాళహస్తిని దర్శించండి.. పరమేశ్వరుని దీవెనలు పొందండి
|
|
|
|
|
సోమవారం, 5 మే 2008( 14:34 IST )
|
|
|
|
|
|
|
|
 | | IVR |
|
|
|
| | ఆంధ్రరాష్ట్రంలోని పంచారామాల్లో ఒకటైన శ్రీకాళహస్తీశ్వరుని ఈసారి తీర్థయాత్రలో దర్శిద్దాం. పెన్నానది ఉపనది స్వర్ణముఖి నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం దక్షిణభారత పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధిగాంచినది. పవిత్ర స్వర్ణముఖి నది ఒడ్డును ఆనుకుని కొండల నడుమన కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి దక్షిణ కాశి అనే పేరుకూడా ఉంది. | |
శ్రీ.. అంటే సాలెపురుగు, కాళ... అంటే పాము, హస్తి... అంటే ఏనుగు... ఇవి ఆ సర్వేశ్వరుని పూజించి మోక్షము నొందాయని అందువల్లనే ఈ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిగా ప్రసిద్ధిగాంచిందని చెప్పబడింది. పురాణ గాధను అనుసరించి ఆలయంలో కొలువున్న శివలింగం చుట్టూ సాలెపురుగు గూడుకట్టి ఆ స్వామివారిని పూజిస్తే... పాము ఓ మణిని శివలింగంపై ఉంచి ప్రార్థించేదనీ... అదేవిధంగా ఏనుగు పవిత్రజలంతో శివలింగాన్ని కడిగి అర్చించేదనీ తెలుపబడింది. దీనిని సూచిస్తూ దేవాలయంలో ఓ విగ్రహం మనకు కనబడుతుంది.
|
|
|
|
|