ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కోర్కెలు తీర్చే పవిత్రమూర్తి సింగాజీ  Search similar articles
WD
తీర్థయాత్రలో భాగంగా ఈసారి సింగాజీ మహరాజ్ దేవాలయాన్ని సందర్శిద్దాం. ఈ దేవాలయం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్లియా గ్రామంలో కొలువై ఉన్నది. గవాలి సమాజంలో జన్మించిన సింగాజీ ఓ సామాన్యమైన వ్యక్తిత్వం కలవాడు. అయితే మన్రంగ్ స్వామివారి బోధనలతో అతని మనస్సు ఆధ్యాత్మిక చింతనవైపు పయనించింది. నిర్గుణ మార్గంలో పయనించిన సింగాజీ మాల్వా- నిమాద్ ప్రాంతంలో ప్రసిద్ధికెక్కాడు. తీర్థయాత్రలు, ఉపవాసాలపై ఆయనకు నమ్మకం లేదు. భగవంతుడు మన హృదయంలోపలే ఉంటాడని విశ్వసించాడు. ఎవరైనా తమ ఆత్మను పూర్తిగా అవలోకనం చేసుకున్నట్లయితే తీర్థయాత్రలు, ఉపవాసాల జోలికి వెళ్లరంటారు. తన కాలంలో ఆయన ఎన్నో సాంఘక సేవా కార్యక్రమాలు చేశారు.
WD


ఈ ఆలయం కొలువై ఉన్న పట్టణాన్ని నర్మద ప్రాజెక్టు ఆక్రమిస్తోంది. ఈ చారిత్రాత్మక మందిరాన్ని రక్షించేందుకుగాను 60 అడుగుల ఎత్తులో సిమెంటు కాంక్రీట్ గోడను చుట్టూ నిర్మించారు. పురాతన మందిరంపై కొత్తగా మరో దేవాలయాన్ని నిర్మించారు. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా సింగాజీ పాదముద్రలను భక్తులు సందర్శించేందుకు వీలుగా తాత్కాలికంగా మరోచోటకు తరలించారు. ఇక్కడ అద్దంలో స్వస్తిక్ ఆకారాన్ని చేయటం ద్వారా తమ కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు. తమ కోర్కెలు నెరవేరిన తర్వాత మరోసారు భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించి స్వస్తిక్ ఆకారాన్ని కుడివైపు చేస్తారు. శరత్ పూర్ణిమ రోజున ఇక్కడ అత్యంత ఘనంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

ఎలా వెళ్లాలి-
రోడ్డు ద్వారా... ఖాండ్వా నుంచి ప్రతి 30 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది.
రైలు ద్వారా... ఖాండ్వా నుంచి సమీప రైల్వే స్టేషనకు రైలు సౌకర్యం ఉంది.
వీడియోను వీక్షించండి
చిత్రమాల
సింగాజీ ఫోటోగ్యాలెరీ
మరిన్ని
శ్రీ లక్ష్మీ నరసింహునికి చందనోత్సవం  
శ్రీకాళహస్తిని దర్శించండి.. పరమేశ్వరుని దీవెనలు పొందండి  
పరశురాముని జన్మస్థలం... షహజహన్‌పూర్  
భక్తుల కోర్కెలు తీర్చే మా చంద్రికాదేవి ధామ్  
కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం
భక్తుల కోర్కెలు తీర్చే బీజాసేన్ ఆలయం