| పూజలందుకునే దాదా ధునివాలె దాదాజీ |
| | | | | | |
| | |
| |
చోటే దాదాజీ ( స్వామి హరిహరనాథ్‌జీ ) రాజస్థాన్‌లోని దిద్వానా గ్రామానికి చెందిన భన్వర్‌లాల్ ఓసారి దాదాజీని దర్శించుకునేందుకు వెళ్లారు. దాదాజీని చూసినంతనే ఆయనకు దాసుడై ఆయన పాదాల చెంతనే కాలం గడపటం మొదలుపెట్టాడు. ఎంతో ఉదారస్వభావి అయిన స్వామి హరినాథ్ విష్ణుమూర్తి అవతారంగా భక్తులు కొలిచేవారు.
ఆయనను చోటే దాదాజీగా పిలువబడ్డారు. దాదా దునివాలే సమాధిలోకి వెళ్లిన తర్వాత ఆయన మార్గంలోనే నడిచినవారు చోటే దాదాజీ. భక్తులు చేత పూజలందుకున్న చోటే దాదాజీ అనారోగ్య కారణంగా 1942లో సమాధిలోకి వెళ్లారు.
ఎలా వెళ్లాలి ఖాండ్వా పట్టణానికి రోడ్డు మరియు రైలు సౌకర్యం ఉన్నది. ఇండోర్ (140 కిమీ) సమీప ఎయిర్‌పోర్టు. |