| | వ్యాధులను తొలగించే వైద్యనాధుడు |
| | | | ఆదివారం, 15 జూన్ 2008( 16:12 IST ) | | | |
| | |
| |
సంజీవిని తైలాన్ని కలిగి వున్న శక్తితో వైద్యనాధుడు ఇక్కడకు వేంచేశాడంటారు. బిల్వ పత్రాలు, సంజీవిని మరియు మట్టితో తయారుకాబడి 4 వేల 480 రకాల జబ్బులను నయం చేసే శక్తికలిగిన ఔషధంతో పరమేశ్వరుడు ఇక్కడకు వేంచేశాడు. అందువల్లనే ఆయనను వైద్యనాధునిగా పిలుస్తారు. ఏటా లక్షలాది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని స్వామిని ప్రార్థిస్తారు. నేటికీ ఇక్కడ కొన్ని ప్రత్యేక పద్ధతులలో తయారుకాబడే మాత్రలు తయారవుతుండటం విశేషం. ముఖ్యంగా శుక్తపక్ష శుభముహూర్తంలో అంగశాంతన తీర్థంలో స్నానమాచరించి, దాని అడుగు భాగంలోని మట్టిని తీసుకుని, జటాయువు కుండంలోని విభూతిని దానితో కలిపి, ఆ తర్వాత దానికి సిద్ధమిర్థ తీర్థాన్ని కలపాలి.
ఈ మిశ్రమాన్ని భగవంతుని ముందు కలియబెట్టాలి. ఈ మెత్తని మిశ్రమాన్ని చిన్న చిన్న గుళికలుగా తయారుచేసి వాటిని శక్తి సన్నిధిలో వుంచి పూజ లు నిర్వహించాలి. ఆ తర్వాత వాటిని సిద్ధమిర్థ తీర్థంలో కలిపినట్లయితే ఎటువంటి వ్యాధి అయినా నయమవుతుంది. ఈ జీవితంలోనే కాదు, మరో 5 జన్మలలోనూ సదరు పూజ నిర్వహించిన వ్యక్తికి ఎటువంటి వ్యాధులు బాధలు వుండవు. | |
ఈ ఆలయంలోని పుణ్యతీర్థమైన సిద్ధమిర్థ తీర్థం అత్యంత అందంగా నిర్మించబడింది. కృతయుగంలో కామధేను ఈ క్షేత్రాన్ని దర్శించి శివలింగాన్ని తల పాలతో అభిషేకించిందట. పూజ చేయగా మిగిలినపాలు ఈ ట్యాంకులోకి చేరాయనీ, అందువల్లనే దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వచ్చిందని అంటారు. దుష్టశక్తులతో బాధపడేవారు ఈ ట్యాంకులో స్నానమాచరిస్తే చాలు... వాటి నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఓ సిద్ధేంద్రుని ఆజ్ఞ మేరకు ఈ ట్యాంకులో కప్పలు కానీ, నీళ్లపాములు దరిచేరవని అంటారు.
వైద్యనాధుని నామంతోనే ఈ పట్టణం వైద్యేశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు ఈ ప్రదేశం నాడీ జ్యోతిషానికి కూడా ప్రసిద్థి. కేవలం బొటనవేలి ముద్ర సాయంతో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను ఇక్కడి నాడీ జ్యోతిష్కులు చెపుతారు.
వైద్యేశ్వరుని ఆలయానికి ఎలా వెళ్లాలి
రైలు ద్వారా: చెన్నై- తంజావూరు రైలుమార్గంలో వైద్యేశ్వరుని రైలు స్టేషను ఉన్నది. రోడ్డు ద్వారా: చిదంబరానికి దగ్గర... చెన్నై నుంచి సుమారు 235 కిలోమీటర్ల దూరం. చిదంబరం నుంచి 40 నిమిషాల్లో వైద్యేశ్వరుని ఆలయానికి చేరుకోవచ్చు. బస్సు సౌకర్యం ఉన్నది. విమాన సౌకర్యం: చెన్నై మీనంబాక్కం ఎయిర్ పోర్టు. ఇక్కడ నుంచి రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. |
| |
|