ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆంజనేయస్వామి వారి మహిమలు....  Search similar articles
WD PhotoWD
తీర్థయాత్రలో భాగంగా ఈ వారం మీకు ఓ ప్రత్యేకమైన ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని చూపించబోతున్నాము. ఈ ఆలయం చారిత్రక నగరమైన ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో సాన్వర్ సమీపాన ఉంది. ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ తలక్రిందులుగా ఉండటమే ఈ ఆలయం విశిష్టత. విగ్రహం తలక్రిందులుగా ఉంది కాబట్టే ఈ ఆలయానికి ఉల్టా ఆంజనేయస్వామి ఆలయం అనే పేరు స్థిరపడిపోయింది.

ఈ విగ్రహం ఆంజనేయస్వామి ముఖ భాగాన్ని మాత్రమే కలిగి ఉంది. సాన్వర్ గ్రామ వాసులు ఈ ఆలయం చాలా ప్రాచీనమైనదని, రామాయణ కాలనుంచి ఇది ఉనికిలో ఉంటోందని చెప్పారు. రామ లక్ష్మణులను అహిరావణుడు బంధించి పాతాళలోకానికి తీసుకుపోయినప్పుడు ఆంజనేయస్వామి పాతాళలోకం వరకు వెళ్లి వారి ప్రాణాలను కాపాడాడు. హనుమంతుడు పాతాళలోకానికి వెళ్లిన స్థలం ఇదేనని ఇక్కడి ప్రజల నమ్మకం.

ఈ ఆలయంలోని వీర హనుమాన్ విగ్రహం చాలా శక్తివంతమైనదని భావిస్తున్నారు. ఆలయం సమీపాన పలువురు మహర్షుల మందిరాలు ఉన్నాయి. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నుంచి ఈ మందిరాలు ఉంటున్నట్లు చరిత్ర చెబుతోంది. ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మర్రి, రావి, వేప, పారిజాతం, తులసి చెట్లు ఉన్నాయి. ఇక్కడ రెండు పురాతన పారిజాత వృక్షాలు ఉన్నాయి.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
ఆకాశ క్షేత్రం చిదంబర ఆలయం  
ముంబై మహాలక్ష్మి ఆలయం  
భక్తుల ఇష్టదైవం శ్రీ జగదాంబ మాత  
వ్యాధులను తొలగించే వైద్యనాధుడు  
ఖాండ్వా భవానీ మాత ఆలయం  
ప్రజల శ్రేయస్సుకై జన్మించిన యోగేంద్ర శిలనాథ్