ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు > అతి పురాతన సిద్ధనాథ్ మహదేవ్ ఆలయం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అతి పురాతన సిద్ధనాథ్ మహదేవ్ ఆలయం Search similar articles
WD PhotoWD
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నర్మదా తీరంలో వెలసివున్న సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయ ప్రాశస్త్యాం తెలుసుకుందాం. ఈ ఆలయం నర్మదా తీరంలోని నేమవర్ అనే పట్టణంలో వెలసివుంది. అతిపురాతనమైన ఈ శివాలయం సిద్ధనాథ్ పేరుతో భక్తులకు సుపరిచితం. దేశంలోని వాణిజ్య ప్రాంతాల్లో ఒకటిగా వున్న నాభివూర్‌కు ప్రాంతానికి సమీపంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని సనంద్, సనక్, సనాతన్, సనాత్ కుమార్ అనే నలుగురు సిద్ధ ఋషులు ప్రతిష్టించడం వల్ల ఈ ఆలయాన్ని సిద్ధనాథ్ ఆలయం అనే పేరు వచ్చినట్టు భక్తులు అభిప్రాయపడుతారు.

ఈ శివాలయాన్ని క్రీ.పూ.3094 సంవత్సరంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. ఆరంభంలో ఆలయ ముఖద్వారం తూర్పు దిశగా ఉండేదని, పంచపాండవుల్లో ఒకరైన భీముడు పశ్చిమవైపుకు తిప్పినట్టు చెప్పుకుంటారు.

ప్రతి రోజు ఉదయం.. నదీతీరంలోని ఇసుక మేటలపై అతిపెద్ద పాదముద్రికలు కనిపిస్తుంటాయి. ఇవి నలుగురు సిద్ధ ఋషుల పాద ముద్రలుగా ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తుంటారు. అంతేకాకుండా.. చర్మ వ్యాధులు ఉన్న వారు ఈ ఇసుకలో అంగప్రదక్షిణం చేస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని భక్తులు భావిస్తుంటారు.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
కుగ్రామంలోని కనీఫ్‌నాథ్ పుణ్యస్థలం  
జగన్నాథ రథయాత్ర....  
ఆంజనేయస్వామి వారి మహిమలు....  
ఆకాశ క్షేత్రం చిదంబర ఆలయం  
ముంబై మహాలక్ష్మి ఆలయం  
భక్తుల ఇష్టదైవం శ్రీ జగదాంబ మాత