రామచిలుకల మేత కోసం వేలాది కేజీల ఆహారధాన్యాలను వెదజల్లే దృశ్యాలను మీరెక్కడైనా, ఎపుడైనా చూశారా? అలా చల్లిన ధాన్యాలను వందాలది రామ చిలుకలు క్షణాల్లో హాయిగా ఆరగించడాన్ని మీరు కనులారా వీక్షించారా?. ఈ రెండు ప్రశ్నలకు మీ వద్ద నుంచి లేదనే సమాధానం వస్తుంది. అయితే.. ఇలాంటి అపురూప సుందర దృశ్యాలు మీకు చూడాలని ఉందా? మా తీర్థయాత్రలో భాగంగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇండోర్ సమీపంలోని పంచకుయాన్ మందిరానికి మిమ్మలను తీసుకెళతాం రండి.
ఇక్కడ వెలసివున్న హనుమాన్ ఆలయం అత్యంత పురాతనమైంది. ఇక్కడకు రామచిలుకలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ ఆలయానికి 'పంచకుయాన్ హనుమాన్ మందిరం' అనే మరో పేరు ఉంది. ఈ ఆలయానికి వందలాది కాదండీ.. వేలాది రామచిలుకలు ప్రతిరోజూ వస్తుంటాయి.
ఈ ఆలయం ప్రాంగణంలోనే చిన్నపాటి శివుని ఆలయం కూడా ఉంది. ఈ సమాజంలో కేవలం మనుషులు మాత్రమే కాకుండా.. పక్షులు సైతం భగవంతునిపై నమ్మకం కలిగి వుంటాయని ఈ ఆలయాన్ని సందర్శించిన వారికే తెలుస్తుంది. ఈ ఆలయానికి కొన్ని సంవత్సరాలుగా రామచిలుకలు వస్తుంటాయని, ఇక్కడ నివశించే సిద్ధులు చెపుతుంటారు.
|