మహారాష్ట్రలోని నాశిక్ పట్టణంలోని పంచవటి అనే ప్రాంతంలో కొలువైన ఆలయం కపలేశ్వర్ మహదేవ్ ఆలయం. ఇక్కడ పరమశివుడు నివశించినట్టు స్థానికు అభిప్రాయపడుతుంటారు. సాధారణంగా.. శివాలయంలో శివుని విగ్రహానికి ముందుగా నంది విగ్రహం ఉంటుంది. అయితే.. ఈ ఆలయంలో మాత్రం నందీశ్వరుడు కొలువై ఉండడు. భారతదేశంలోనే శివాలయాలల్లో నందీశ్వరుడు లేని ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయాన్ని ఈ వారం తీర్థయాత్రలో మీకు పరిచయం చేస్తాం.
కపలేశ్వర్ మహదేవ్ ఆలయంలో నంది విగ్రహం లేకపోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఇంద్రసభలో ఒక రోజు బ్రహ్మ, శివుని మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఆ సమయంలో బ్రహ్మ తన ఐదు శిరస్సులను ప్రదర్శించగా, వీటిలో నాలుగు వేదాలను పఠించగా, ఒక తల మాత్రం శివుడుని తథేకంగా చూసింది.
దీంతో మరింత ఆగ్రహానికి గురైన శివుడు... ఆ తలను ఖండించాడు. ఇది బ్రహ్మహత్యగా (బ్రహ్మణుని హత్యచేయడం) దోషంగా మారింది. ఈ దోషాన్ని నివృత్తి చేసుకునేందుకు పరమశివుడు ప్రపంచ పర్యటన చేపట్టారు. అయినప్పటికీ.. ఆయన ఎలాంటి దోష నివృత్తి పొందలేక పోయారు.
ఈ దోష పరిహారం కోసం భూలోకం మొత్తం శివుడు పర్యటించినప్పటికీ ఆయనకు ఏ మార్గం తోచలేదు. తదనంతరం దోష నివారణ కోసం సోమేశ్వరం అనే స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఓ గోవు... బ్రాహ్మణుడిని తన కొమ్ములతో పొడిచి బ్రహ్మహత్యకు గురి చేసిన తన దూడకు పరిహార నివృత్తిని చెప్పడాన్ని పరమేశ్వరుడు గమనించాడు.
అనంతరం బ్రహ్మహత్యకు గురైన ఆ గోవు పరిహారం కోసం వెళ్లే మార్గంలోనే పరమేశ్వరుడునూ అనుకరించారు. పంచవతి సమీపానికి చేరుకున్న వెంటెనే గోదావరి నదిలో ఆ గోవులు స్నానమాచరించి. తమ బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకున్నాయి. అదే ప్రాంతంలో పరమేశ్వరుడునూ స్నానమాచరించి తన బ్రహ్మహత్యను పోగొట్టుకున్నారని శాస్త్రాలు చెబుతున్నాయి.
|