తర్వాత శివపరమేశ్వరుడు సమీపంలో ఉన్న కొండపై ఆసీనులైయ్యారు. శివనాథుడిని వెన్నంటి వచ్చిన గోవు ఆయన ముందు మోకాలితో కూర్చొంది. అయితే తన బ్రహ్మహత్య దోష నివారణకు గురువుగా దోహదం చేసిన గోవు తన ముందు మోకాటి దండ వేసి ఆశీనులైంది. దీన్ని పరమేశ్వరుడు అంగీకరించకపోవడంతో ఈ ఆలయంలో నంది విగ్రహాన్ని ప్రతిష్టించబడలేదని పెద్దలు చెబుతున్నారు.
దేశంలోని పలు ప్రాంతాల నుంచి శివభక్తులు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున విచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పూర్వం "శివలింగం"గా పూజలందుకున్న కైలాస నాథుడి ఆలయాన్ని భక్తులు నిధులు సేకరించి ఆలయంగా నిర్మించారు.
ఈ ఆలయ సమీపంలో ఉన్న గోదావరి నదిలో "శ్రీరాముడు" ఆయన తండ్రి దశరథ మహారాజును స్మరించి పితృపూజను గావించినట్లు ప్రతీతి ఉండటంతో... వేలకొలది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పితృదేవతలకు పూజలు చేస్తుంటారు. ఇందులో ముఖ్యంగా, శ్రావణ మాస సోమవారాల్లో వేలకొలది భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి పరమేశ్వరుడిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. శ్రావణ మాసంతో సహా, ప్రతి సోమవారం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు.
ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి. రోడ్ మార్గం ద్వారా... ముంబై నుంచి 160 కిలోమీటర్ల దూరంలో నాశిక్ ఉంది. అలాగే.. పూణె నుంచి 210 కిలోమీటర్లు. ఈ ప్రాంతాల నుంచి 24 గంటల పాటు బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
రైలు మార్గం ద్వారా... దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి నాశిక్‌కు పలు రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అలాగే.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి నాశిక్‌కు రైలు, బస్సు సర్వీసులు ఉన్నాయి.
విమాన మార్గం ద్వారా... నాశిక్ పుణ్య క్షేత్రానికి 210 కిలోమీటర్ల దూరంలో పూణె విమానాశ్రయం ఉంది. |