భక్తి... భగవంతునికి, భక్తునికి మధ్య విభజించలేని ప్రత్యేక బంధం. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే భక్తుడు దైవ సన్నిధికి చేరుకునేందుకు భక్తులు వస్తుంటారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని ముక్తి మార్గానికి చేరుకునేందుకు మార్గాన్వేషణ చేస్తారు. అయితే మా తీర్థయాత్రలో భాగంగా.. ఈ వారం శివసన్నిధిని మీకు పరిచయం చేస్తున్నాం. ఈ పుణ్యస్థలమే మహా కేధారేశ్వర్ ఆలయం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లమ్ అనే ప్రాంతానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైలానా అనే ప్రాంతంలో ఈ ఆలయం వుంది. ఇక్కడకు ఆ రాష్ట్రానికి చెందిన భక్తులు మాత్రమే కాకుండా.. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయం కనువిందు చేసే పచ్చటి కొండలు, ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగివుండే రమణీయ ప్రకృతి అందాలు, పాలవన్నెలాంటి నీటి జలపాతాల మధ్య వెలసి వుంది.
ఈ ఆలయానికి 278 సంవత్సరాల చారిత్రక నేపథ్యం వుంది. అంటే.. 1730 సంవత్సరంలో సహజసిద్ధంగా ఇక్కడ శివలింగం వెలసినట్టు పేర్కొంటారు. ఆ తర్వాత అంటే.. 1736లో సైలానా మహారాజు జయసింగ్ అందమైన ఆలయాన్ని నిర్మించారు. గత 1959-95 సంవత్సరాల మధ్య రాజు తులసింగ్ అందజేసిన రూ.1.50 లక్షల నిధులతో ఆలయం జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేశారు.
|