కావేరీ నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వెళ్లిన త్యాగరాజర్‌కు శ్రీ కోదండరామస్వామి విగ్రహం ఒకటి లభ్యమవుతుంది. ఆ నదీ తీరంలోనే దీన్ని ప్రతిష్టించి, పూజలు చేసేవాడు. అలా కర్ణాటక సంగీతలో 24 వేల సంకీర్తనలు ఆలపించి, శ్రీ రాముని భక్తి ప్రపత్తులతో పూజించాడు.
త్యాగరాజర్ ఆలపించిన ప్రతి సంకీర్తన కర్ణాటక సంగీత రస ప్రియులను ఎంతో ఉత్సాహ పరిచేవిగా ఉంటాయి. వివిధ ప్రధాన వేదికల్లో జరిగే సంగీత కచేరిలలో త్యాగరాజ కీర్తనలు ఆలపించని కచేరి ఉండదంటే ఆశ్చర్యం చెందాల్సిన పనిలేదు. పంచరత్న కీర్తనలుగా పిలిచే సంకీర్తనలను ఎక్కువగా ఆయన జయంతి రోజున ఐదు రోజుల పాటు ఆలపిస్తారు. ఇందులో వందలాది మంది సంగీత కళాకారులు పాల్గొంటారు.
శ్రీ త్యాగరాజర్ తన 80వ యేట పరలోకానికి చేరుకున్నాడు. ఆయన పార్థీవాన్ని పాతిపెట్టిన స్థలంలోనే శ్రీ రామాలయాన్ని నిర్మించారు. శ్రీ రాముని దైవ సన్నిధినిలో త్యాగరాజర్ విగ్రహాన్ని, పాదరక్షలను ఉంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ ఆలయంలో త్యాగరాజర్ ఆలపించిన సంకీర్తనలు శిలాఫలకాలపై చెక్కించారు. ఉన్నత ఆధ్యాత్మిక భావాలతో వెలసిన ఈ ఆలయానికి ఎపుడు వెళ్లినా భక్తిభావం ఉట్టిపడుతుంది.
ఎలా వెళ్లాలి.. రైలు మార్గం.. చెన్నై నుంచి తంజావూరుకు రైలులో వెళ్లి, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అర్థ గంట సమయంలో తిరువైయారుకు చేరుకోవచ్చు.
విమానంలో.. తిరువైయారుకు సమీపంలో ఉన్న విమానాశ్రయం తిరుచ్చి. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరువైయారుకు చేరుకోవచ్చు.
బస్సు మార్గం.. చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడకు బస్సు సౌకర్యం వుంది. |