ఈ వారం తీర్థయాత్రలో భాగంగా.. మీకు దేశంలోని వివిధ జైన ఆలయాలను పరిచయం చేస్తున్నాం. ఈ మతం ప్రజలు పర్యూషాన్ అనే ఉత్సవాన్ని ఎంతో వేడుకగాను, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. సాధారణంగా జైన మతంలో రెండు తెగలు ఉన్నాయి. వీటిలో ఒకటి.. శ్వేతాంబర్. రెండోది దిగంబర్. శ్వేతాంబర్ తెగలో పర్యూషాన్ ఉత్సవాన్ని ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు.
ఆ తర్వాత దిగంబర్ తెగ వారు ఇదే వేడుకలను పది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఉత్సవానికే 'దుస్లాక్షన్' అనే పేరు కూడా ఉంది. దేశ ప్రజలు ఘనంగా జరుపుకునే ప్రధాన పండుగలైన దీపావళి, ఈద్, క్రిస్మస్ వంటి పండుగల వలె పర్యూషాన్ ఉత్సవాలు వైభవంగా జరుగక పోయినా, జైన సంప్రదాయంలో ఈ ఉత్సవాలకంటూ ప్రత్యేక స్థానం ఉంది.
జైన సంప్రదాయాలకు అద్దం పట్టే పర్యూషాన్ వేడుకలను ఈ ఏడాది ఇండోర్‌లోని అన్ని ఆలయాల్లో తిలకించవచ్చు. మహావీర్ అనుగ్రహాన్ని పొందేందుకు వేలాది మంది భక్తులు పర్యూషాన్ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవకాలంలో అలంకారప్రాయమైన ఆలయ అందాలు భక్తులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటాయి.
|