|
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా శ్రీ క్షేత్ర మునుదేవి ఆలయ చరిత్రను మీకు పరిచయం చేస్తున్నాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను వేరు చేసే అందమైన సత్పురా పర్వతశ్రేణుల మధ్య ఈ ఆలయం కొలువైవుంది. మునుదేవి ఆలయంలో ఖందేష్ దేవిమాత కొలుదీరి, భక్తుల మొక్కులు తీర్చుతోంది.
ఈ పురాతన ఆలయం మహారాష్ట్రకు ఈశాన్య దిక్కుగా ఉండే యావల్-ఛోప్రా జాతీయ రహదారి కాసరఖేడ్-అడగాన్ గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం చుట్టూత కనువిందు చేసేలా తివాచీ పరిచినట్టుగా కనిపించే పచ్చటి పర్వతశ్రేణులు ఆలయానికి మరింత శోభను కనిపిస్తున్నాయి. ఆలయానికి సమీపంలోని గ్రామాల ప్రజలు ఇక్కడకు వచ్చి ఖందేష్ మాతను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుని వెళుతుంటారు.
సాత్పురా పర్వతశ్రేణుల్లోని గ్వాలివదా ప్రాంతానికి క్రీస్తుపూర్వం 1200 కాలంలోఈశ్వర్‌సేన్ అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయకు అపార పశుసంపద ఉండేది. కొన్ని గోవులు రోజు ప్రస్తుత మహారాష్ట్రలోని తపతి నదికి నీరు త్రాగడానికి వెళ్లేవి. మిగిలిన గోవులు మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదికి వెళ్లేవి. అయితే ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో మాన్‌మోది అనే భయానక వ్యాధి వ్యాపించసాగింది. ఖాందేశ్ ప్రాంతమంతా ఈ వ్యాధి వ్యాపించింది. దీంతో ఖాందేశ్‌తో పాటు, సాత్పుర పర్వతశ్రేణుల్లో భారీగా పశు ప్రాణనష్టం సంభవించింది.
ఈ భయానక వ్యాధి నుంచి రాజ్యాన్ని రక్షించేందుకు క్రీస్తుపూర్వ 1250 కాలంలో రాజు ఈశ్వర్‌సేన్ గ్వాలివదా నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో "మనుదేవి" మాత ఆలయాన్ని నిర్మించారు. అనంతరం గ్వాలివదాకు, ఆలయానికి మధ్యలో ఆయన 13 అడుగుల వెడల్పుతో గోడను నిర్మించారు.
|