తీర్ధయాత్రలో భాగంగా ఈ వారం మిమ్ములను సిద్ధివీర్ గోగాదేవ్ ఆలయానికి తీసుకెళుతున్నాం, ఈ ఆలయం రాజస్తాన్ చూరు జిల్లాలోని దత్తఖేడ వద్ద ఉంది. అన్ని మతాల, కులాల ప్రజలు సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేస్తుంటారు. దత్తఖేడ అనేది గోగాదేవ్ జన్మస్థలం. నాథ్ కమ్యూనిటీకి చెందిన మహర్షులకు ఇది చాలా ముఖ్యమైన ఆలయంగా ఉంది. మధ్యయుగాల్లో గోగోజా అనే వ్యక్తి లోకదేవత (సామాన్యుల దేవుడు)గా పేరుపొందారు. హిందూ, ముస్లిం, సిక్కు ఇలా అన్ని మతాలకు చెందిన ప్రజలు ఇతడి అనుచరులుగా ఉండేవారు. ఇతడు ఏ ఒక్క మతానికి చెందినవాడు కాదు. రాజస్తాన్‌లోని చూరు ప్రాంతానికి చెందిన దాడ్రెవా రాజపుట్ వంశంలో గోగాజి జన్మించారు. ఇతడి తండ్రి జైబర్ చూరు పాలకుడు. తల్లి బచాల్. బాడవ్ నెలలో నవమి రోజున గురు గోర్ఘానాథ్ ఆశీర్వాదంతో ఇతడు జన్మించాడని ప్రతీతి. చౌహాన్ రాజవంశంలో, పృధ్వీరాజ్ చౌహాన్ తర్వాత గోగాజీ వీర్ సుప్రసిద్ధ పాలకుడుగా ఉండేవాడు. సట్లుజ్ నుంచి హాన్సీ (హర్యానా) వరకు ఇతడి సామ్రాజ్యం వ్యాపించి ఉండేది. స్థానిక విశ్వాసాల ప్రకారం గోగాజీ సర్పదేవత పూజలందుకునేవాడు. ప్రజలు ఇతడిని గోగాజీ చౌహన్, గుగ్గా, జహీర్ వీర్, జహీర్ పీర్ వంటి పలు పేర్లతో పిలిచేవారు. గురు గోరక్షనాథ్ ప్రధాన శిష్యులలో ఇతడు ఒకడిగా ఉండేవాడు. దత్తఖేడలో గురు గోరక్షనాథ్ ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ గోగాదేవ్‌జీ గుర్రంపై కూర్చున్న భంగిమలో ఒక విగ్రహం కూడా ఉంది. ఇతడికి ప్రార్థనలు చేసి పూజించేందుకోసం భక్తులు ఈ స్థలానికి వస్తుంటారు.
|
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
|