గోగాదేవ్‌జీ జన్మస్థలం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో హనుమాన్ గడ్ జిల్లాలోని నోహర్ మండలంలో గోగామడి దామిన్ అనే స్థలం ఉంది. ఇక్కడే గోగాదేవ్‌జీ సమాధి ఉంది. ఇక్కడ ఇద్దరు పూజారులు ఉంటున్నారు. ఒకరు హిందూ. మరొకరు ముస్లిం. ఈ ప్రాంతంలో మత సామరస్యానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. శ్రావణ మాసం నుంచి భాద్రపద మాసం వరకు ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవ కాలంలో లక్షలాది ప్రజలు గోగాదేవ్ ఆశీస్సుల కోసం వస్తుంటారు. ఆసమయంలో వాతావరణం మొత్తంగా భక్తి విశ్వాసాల మేలుకలయికగా వెలుగొందుతుంటుంది. రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిలో గోగాదేవ్ ప్రభావాన్ని ఎవరయినా ఇట్టే పట్టేయవచ్చు. గోగాదేవ్ ఆదర్శ వ్యక్తిత్వం భక్తులను మిక్కుటంగా ఆకర్షిస్తూ ఉంటుంది. మానవజాతికి శుభం కలిగించేందు కోసం మహత్కార్యాలు చేయగలిగేలా గోగాదేవ్ ఆయన ఆదర్శాలు ఈనాటికీ భక్తులను ప్రభావితం చేస్తున్నాయని మేధావులు, చరిత్ర పరిశోధకులు చెబుతుంటారు. ఎక్కడ ఉంది.. ఎలా వెళ్లాలి...? సమీప విమానాశ్రయం జైపూర్‌లో 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. సదల్‌పూర్ రైల్వే సమీప రైల్వే స్టేషన్. దత్తఖేడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. జైపూర్ నుంచి మీరు సాదల్‌పూర్‌కు రైలుమార్గంలో కూడా చేరవచ్చు. జైపూర్ నుంచి సాదల్‌పూర్‌కు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం ఉంది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలతో ఇది అనుసంధానించబడి ఉంది. సాదల్‌పూర్ నుంచి దత్తఖేడ మధ్య దూరం 15 కిలోమీటర్లు. టాక్సీ, బస్సులు ఇక్కడినుంచి లభ్యమవుతుంటాయి. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |