ఇలా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని ఎంతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆలయానికి వచ్చి పూజలు, ప్రార్థనలు చేయడం ఇక్కడ గమనిస్తాం. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడకు వస్తుంటారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటం వల్ల ఆలయానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు దైవ దర్శనం చేసుకుని, తమ కష్టాలను చెప్పుకున్నట్టయితే అవి తీరుతాయనే భావన భక్తుల్లో ఉంది. ఈ ప్రఖ్యాత పుణ్యస్థలానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయానికి చెందిన 'సదావార్త' అనే ఛారిటబుల్ సంస్థ జగన్నాథుని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులకు అన్నదానం చేస్తోంది. సాధువు నర్సింగ దాస్ ఆజ్ఞ మేరకు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఇక్కడకు ప్రతినిత్యం వచ్చే వందలాది మంది భక్తులకు అన్నదానం పథకం కింద పుష్టిగా ఆరగిస్తున్నారు. ఎలా వెళ్లాలి విమాన మార్గం.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి పలు వాహనాలు ఆలయం వరకు అద్దెకు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం... అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని కలుపూర్ రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. అంతేకాకుండా మణినగర్, శబర్మతీ రైల్వే స్టేషన్‌ల నుంచి కూడా ఆలయానికి వెళ్ళవచ్చు. రోడ్డు మార్గం.. అహ్మదాబాద్‌తో పాటు ప్రధాన నగరాల నుంచి జగన్నాథ్ ఆలయానికి బస్సు, టాక్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |