ఆలయానికి వెళ్లే దారిలో 472 మెట్లు ఉంటాయి. చైత్ర, అశ్విని నవరాత్రులలో ఇక్కడ ఉత్సవం జరుగుతుంటుంది. చైత్రమాసంలో దేవి దరహాస వదనంతో ఉండగా, నవరాత్రులలో రుద్రరూపంలో ఉంటుందని చెబుతుంటారు. పర్వతంలో 108 చిన్న మడుగులు ఉంటున్నాయి. ఇవి ఈప్రాంత సౌందర్యాన్ని ఇనుమడింప జేస్తుంటాయి. గమ్య మార్గాలు ఇక్కడికి సమీపంలో ముంబై లేదా పూణే విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక్కడినుంచి మీరు నాసిక్ పట్టణానికి బస్సు లేదా ప్రయివేట్ వాహనంలో వెళ్లవచ్చు.అన్ని ముఖ్య నగరాలతో నాసిక్‌కు రైలు మార్గం ఉంది. కాబట్టి ఇక్కడికి రైలుప్రయాణం చాలా సులువైన మార్గం.నాసిక్‌కు 65 కిలోమీటర్ల దూరంలో సప్తశృంగి పర్వత శ్రేణి ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మీరు మహారాష్ట్ర రోడ్డు రవాణా బస్సును లేదా ప్రయివేటు వాహనాన్ని ఉపయోగించవచ్చు. |