ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధురాలై ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుందట. చరిత్రలోకి పోయి చూస్తే మరాఠా వీరుడు శివాజీ కూడా ఈ ఆలయాన్ని సందర్శించాడు. కళ్యాణ్ నగరాన్ని దోచుకుని తిరిగి తన రాజధాని నగరమైన రాయగర్‌కు వెళుతున్న క్రమంలో శివాజీ ఈ దేవి ఆలయాన్ని సందర్శించాడని ప్రతీతి.కంటికింపుగా కనిపించే ఆలయగోపురంతో, ప్రాకృతిక వాతావరణంతో కూడిన ఇగాత్ పురి ఆలయం ఎవరికయినా భక్తి విశ్వాసాలను పాదుకొల్పుతుంది. పర్వతలోయలో సుందరమైన ఆలయమైన ఘాటన్ దేవి ఆలయాన్న ఎవరైనా చూసి తరించాల్సిందే తప్ప వర్ణించలేరు. గమ్య మార్గాలు వాయు మార్గం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇగాత్ పురికి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారత దేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో ముంబై అనుసంధానమై ఉంది. ప్రపంచంలోని పలు నగరాలనుంచి కూడా ఈ నగరానికి విమానాల రాకపోకలు సాగుతుంటాయి. ముంబైనుంచి నేరుగా టాక్సీలో ఇగాత్ పురి ఆలయానికి రావాలంటే రూ.2,000 ఖర్చు అవుతుంది. రైలు మార్గం ముంబై విక్టోరియా టెర్మినస్ నుంచి తపోవన్ ఎక్స్‌ప్రెస్ ఇగాత్ పురి రైల్వే స్టేషన్‌కు వస్తుంది. ఇక్కడికి సమీపంలోని ప్రముఖ రైలు స్టేషన్ కసారా. రైలు మార్గం ద్వారా పలు నగరాలకు ఇది అనుసంధానమై ఉంటుంది. కసారా నుంచి ఇగాత్ పురికి నేరుగా అరగంట వ్యవధిలో టాక్సీలో రావచ్చు. దీనికి రూ.300 ఖర్చు అవుతుంది.బస్సు మార్గం మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పొరుగున ఉన్న అన్ని ప్రధాన నగరాలనుంచి ఇగాత్ పురికి బస్సులను పంపుతుంటుంది. ముంబయ్, నాసిక్, కసారా ప్రాంతాలనుంచి ఇక్కడికి బస్సులు వస్తుంటాయి. ముంబయ్ నుంచి కసారాకు టూరిస్టు బస్సులు వస్తుంటాయి. వీటిలో రావాలంటే రూ.500లు ఖర్చవుతుంది. |