ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009 » ఛాంపియన్స్ ట్రోఫీ: కివీస్‌పై ప్రోటీస్ విజయం (South Africa | New Zealand | Champions Trophy)
 
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన గ్రూపు బి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆతిథ్య జట్టు విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో పరాజయంపాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకొని రెండో మ్యాచ్ బరిలో దిగిన దక్షిణాఫ్రికా ఇక్కడ మాత్రం గట్టెక్కింది. కివీస్‌పై విజయంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

దక్షిణాఫ్రికా సెమీస్ చేరాలంటే ఇంగ్లండ్‌పై జరిగే తన మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సివుంటుంది. ఇదిలా ఉంటే తాజా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో కివీస్‌పై విజయభేరి మోగించింది. 215 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 41.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. డివిలియర్స్ (70) అర్ధ సెంచరీతో ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సునాయసమైంది.

అంతకుముందు టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 214 పరుగులు చేసి ఆలౌటయింది. దక్షిణాఫ్రికా బౌలర్ పార్నెల్ ఐదు వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. రాస్ టేలర్ (72) రాణించడంతో కివీస్ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పార్నెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.