ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లను విశాఖపట్నంలో నిర్వహించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.ఫ్రాంచైజీలకు పరిసర ప్రాంతాల్లో మ్యాచ్‌లు నిర్వహించుకునే స్వేచ్ఛ లభించటంతో కోల్‌కత నైట్‌రైడర్స్ ఇప్పటికే బంగ్లాదేశ్‌కు కొన్ని మ్యాచ్‌లను తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా దక్కన్ ఛార్జర్స్ ఆడే మ్యాచ్‌లు రెండింటిని వైజాగ్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి చాముండేశ్వరీనాథ్ మీడియాతో మాట్లాడుతూ... దక్కన్ ఛార్జర్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నామనీ, రెండు మ్యాచ్‌లు వైజాగ్‌లో నిర్వహించాలన్నది తమ ప్రతిపాదన అని పేర్కొన్నారు. కాగా, దక్కన్ ఛార్జర్స్ ఈ విషయంలో సానుకూలంగానే స్పందించినట్లు ఆయన తెలిపారు. |