ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తన భారత అభిమాన క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఆడే క్షణాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యువ సంచలనం జీన్ పాల్ డుమినీ ఆకాంక్ష వ్యక్తం చేశాడు.ఏఫ్రిల్ నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ రెండో సీజన్‌లో డుమినీ "ముంబై ఇండియన్స్"కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి ఐపీఎల్ వేలంపాటల్లో డుమినీని తొమ్మిదిన్నర లక్షల డాలర్లను వెచ్చించి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి విదితమే.ఈ మేరకు ఐపీఎల్‌లో ఆడనున్న డుమినీ తన అభిమాన క్రికెటర్ అయిన సచిన్‌తో కలసి ఆడే మధుర క్షణాల కోచి వేచి చూస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా, ప్రత్యర్థుల విమర్శలకు మౌనంగానే తన బ్యాట్‌తో సమాధానం చెప్పే సచిన్‌కు స్వదేశంలోనూ, విదేశాలలోనూ అభిమానులుండటం సహజమైన విషయమే. డుమినీ అందుకేమీ తీసిపోడు కూడా...! |