ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ఐపీఎల్ వార్తలు > ఐపీఎల్‌తోనే వెలుగులోకొచ్చిన కులకర్ణి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐపీఎల్‌తోనే వెలుగులోకొచ్చిన కులకర్ణి
FILE
మొదటి దఫా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తరపున ఆడటంతోనే ధావల్ కులకర్ణి వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో 11 మ్యాచ్‌లో ఆడిమ కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్ అయిన కులకర్ణి అత్యధికంగా 12 వికెట్లు పడగొట్టాడు. దీంతో 20 ఏళ్ల కులకర్ణికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆడే అవకాశం దక్కింది.

తొలి సీజన్‌లోనే కుదురైన మీడియం పేస్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన కులకర్ణి 9 మ్యాచ్‌లలో 19.35 సగటుతో 42 వికెట్లు తీసి జడేజాతో కలిసి రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా గుర్తించబడ్డాడు. దీంతో శుక్రవారం న్యూజిలాండ్ పర్యటనకుగానూ జరిగిన సెలక్షనల్లో టీం ఇండియా జట్టులోకి కులకర్ణి ప్రవేశం లభించింది.

ఇదిలా ఉంటే... 2005-06 సీజన్‌లో ముంబై తరపున విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆడటం ద్వారా దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టిన కులకర్ణి అండర్-19 స్థాయిలోనే సంచనాలు సృష్టించాడు. 2007లో లంక పర్యటనకు వెళ్లిన అండర్-19 జట్టులో కూడా ఇతను ఆడాడు.

అనతికాలంలో జాతీయ జట్టులో చోటు సంపాందించిన ఈ ముంబై చిన్నవాడు.. పేస్ బౌలింగ్ స్వర్గధామం అయిన కివీస్ పిచ్‌లపై తన ప్రతిభను ఎలా రంగరించి ఆడతాడో వేచి చూడాల్సిందే మరి...!
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారంకై మల్టీఫ్లెక్స్‌ల పోటీ
ఉప్పల్‌లో కష్టమే : దక్కన్ చార్జర్స్
పాక్ బౌలర్ అసిఫ్‌పై ఐపీఎల్‌లో నిషేధం
కేపీ రాయల్స్ జాతకాన్ని మారుస్తాడు : జెన్నింగ్స్
సచిన్‌తో ఆడాలి : డుమినీ ఆకాంక్ష
విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు...!